Manuguru: ఎల్‌నినో ప్రభావం, నీటి వృధాపై సమితి సింగారం సర్పంచ్ అవగాహన
Manuguru: కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సమితి సింగారంలో ఎల్‌నినో ప్రభావం, నీటి వృధాపై సర్పంచ్ కలబోయిన మాధవరావు, ఉప సర్పంచ్ సురేష్ ఇంటింటికీ అవగాహన కల్పించారు.
Manuguru: ఎల్‌నినో ప్రభావం, నీటి వృధాపై సమితి సింగారం సర్పంచ్ అవగాహన
మణుగూరు: మణుగూరు మండలం, సమితి సింగారం గ్రామపంచాయతీ పరిధిలో విస్తృతంగా పర్యటించి ఇంటింటికి తిరుగుతు ప్రజలకు ఎలి నినో ప్రభావం మరియు నీటి వృధా పై అవగాహన కల్పిస్తున్న... సమితి సింగారం గ్రామపంచాయతీ సర్పంచ్ కలబోయిన మాధవరావు, ఉప సర్పంచ్ గాండ్ల సురేష్, వార్డు సభ్యులు ఎస్కే రహీం పాషా గార్లు.
ఈ సందర్భంగా సమితి సింగారం గ్రామపంచాయతీ పరిధిలో ప్రజలు నీటిని వృధాగా చేయవద్దని నీటి అవసరం తీరిన వెంటనే పంపులకు డమ్మీ మూతలను పెట్టాలని విజ్ఞప్తి చేసినారు. అలాగే భూగర్భ జలాలను కాపాడుకోవడానికి ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలి. వృధా నీటిని ఇంకుడు గుంతల్లో చేరే విధంగా చేసినట్లయితే భూగర్భ జలాలు పెరుగుతాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ డైరెక్టర్ కుర్రి చలపతిరావు, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు ఎండి యాకూబ్ అలీ తదితరులు పాల్గొన్నారు.




