Manuguru: సమితి సింగారంలో ఘనంగా 'బాలల గ్రామసభ' కార్యక్రమం!

Manuguru: మణుగూరు మండలం సమితి సింగారంలో సర్పంచ్ కలబోయిన మాధవరావు అధ్యక్షతన బాలల గ్రామసభ నిర్వహించి, బాలల హక్కులు ಹಾಗೂ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు.

A CHANDRA SHEKAR, PINAPAKA
Published on: 15 Nov 2026 8:52 AM IST
Manuguru
X

Manuguru: సమితి సింగారంలో ఘనంగా 'బాలల గ్రామసభ' కార్యక్రమం!

Manuguru: మణుగూరు మండలం, సమితి సింగారం గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ కలబోయిన మాధవరావు గారి అధ్యక్షతన "బాలల గ్రామసభ " కార్యక్రమం నిర్వహించడం అయినది.

ఈ యొక్క గ్రామసభలో సర్పంచ్ కలబోయిన మాధవరావు ఉప సర్పంచ్ గాండ్ల సురేష్, ఎంపీఓ పల్నాటి వెంకటేశ్వరరావు, సెక్రటరీ జక్కుల అశోక్ కుమార్ గార్లు మాట్లాడుతు సమితి సింగారం గ్రామపంచాయతీ పరిధిలో గల బాలలకు వారి హక్కులు మరియు బాధ్యతలు అలాగే సమాజం పట్ల వారి పరివర్తన గురించి వివరిస్తూ తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం బాలబాలికల అభ్యున్నతికి అందిస్తున్న సంక్షేమం మరియు విద్య, సంరక్షణ, వైద్యం తదితర అంశాల గురించి తెలియజేయడమైనది.

ఈ కార్యక్రమంలో సమితి సింగారం గ్రామపంచాయతీ వార్డు సభ్యులు వేల్పుల నరేష్, మాదాడి రాజేష్, కొల పిన్ని మానస, ఉకే కృష్ణవేణి మరియు పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

A CHANDRA SHEKAR, PINAPAKA

A CHANDRA SHEKAR, PINAPAKA