Sathupalli: సత్తుపల్లిలో విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆరోగ్య అవగాహన

Sathupalli: సత్తుపల్లి విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో ఆరోగ్య అవగాహన సదస్సు. పాల్గొన్న ఆయుర్వేద వైద్యులు డాక్టర్ ఎన్. సుధ. వృద్ధాప్య సమస్యలపై సలహాలు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 15 Aug 2026 7:37 PM IST
Sathupalli
X

Sathupalli: సత్తుపల్లిలో విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆరోగ్య అవగాహన

సత్తుపల్లి: మన ఆరోగ్యాన్ని పరి రక్షించుకోవడానికి తగిన ముందు జాగ్రత్తలు అవసరమని ఆయుర్వేద వైద్యులు డాక్టర్ ఎన్.సుధ అన్నారు.

స్వతంత్ర దినోత్సవం సందర్భంగా సత్తుపల్లి లోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో జరిగిన 'ఆరోగ్య అవగాహన' కార్యక్రమంలో డాక్టర్ సుధ మాట్లాడుతూ వృద్ధాప్య దశలో ఎదుర్కునే సమస్యలు, వాటి నివారణకు తీసుకోవలసిన ముందు జాగ్రత్తల గురించి తెలియచేసారు.

తగినంత వ్యాయామం, పోషక విలువలు గల ఆహారం, క్రమం తప్పకుండా అవసరమైన మందులు వాడటం... ఇటువంటి జాగ్రత్తలతోనే వ్యాధులను కట్టడి చేసే అవకాశం ఉందని వివరించారు.

ఆరోగ్య పరమైన అనేక వివరాలను డాక్టర్ సుధ పెన్షనర్లకు వివరించారు. కార్యక్రమం అనంతరం డాక్టర్ సుధను శాలువాతో సత్కరించారు. ఈ అవగాహన కార్యక్రమంలో సంఘ అధ్యక్ష, కార్యదర్శులు కేశవరెడ్డి, ప్రకాశరావు, నర్సయ్య, కమల కుమారి, నాగరత్నం,బూరుగు దాసు,జి.కృష్ణయ్య,మాధవరెడ్డి,యోగానంద్,డి.కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI

Next Story