Sathupalli: సత్తుపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఓట్ల నమోదు!

Sathupalli: సత్తుపల్లిలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదు ప్రత్యేక డ్రైవ్. అర్హులు ఓటు హుక్కు నమోదు చేసుకోవాలని బీజేపీ నేతల పిలుపు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 9 Oct 2026 2:56 PM IST
Sathupalli
X

Sathupalli: సత్తుపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఓట్ల నమోదు!

Sathupalli: భారతీయ జనతా పార్టీ సత్తుపల్లి పట్టణ అధ్యక్షులు బాణావత్ విజయ్ ఆధ్వర్యంలో, సత్తుపల్లి పట్టణంలో వివిధ పాఠశాలలు, కళాశాలలందు ఉన్న పట్టభద్రుల ను కలుసుకొని,రానన్న ఖమ్మం వరంగల్ నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ నమోదు ప్రక్రియను నిర్వహించటం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి నాయుడు రాఘవరావు హాజరై మాట్లాడుతూ 2023 అక్టోబర్ 31 వరకు డిగ్రీ అర్హత ఉన్న ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకోవాల్సిందిగా కోరారు ఓటు నమోదు ఆన్ లైన్ లో కానీ ఆఫ్ లైన్లో కానీ నమోదు చేసుకోవచ్చన్నారు.

ఓటు నమోదు చేసుకోవడం కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సహాయం చేస్తారన్నారు. అదేవిధంగా ఆన్లైన్ చేయుటకు ఉచితంగా మహి కంప్యూటర్ వారు చేస్తారన్నారు .కాబట్టి గ్రాడ్యుయేట్స్ అందరూ తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాలని కోరారు.

గ్రాడ్యుయేట్స్ తో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాల్సిందిగా, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి బాసటగా నిలవాల్సిందిగా కోరారు. శాస్త్ర, సాంకేతిక, పారిశ్రామిక, ఆర్థిక ,అంతరిక్ష రంగాలలో భారతదేశాన్ని ప్రపంచంలోనే ముందువరుసలో నిలబెట్టేందుకు మోడీ గారు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు.

యువతను పక్కదారి పట్టించే కుట్ర జరుగుతుందని దీనిపట్ల యువత, ప్రజలు జాగురూకతతో ఉండాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శులు మందా శివ యాదవ్,నాగా మౌనిక, మాజీ మండల అధ్యక్షులు పాలకొల్లు శ్రీనివాస్, డాక్టర్ పెద్దిరాజు, కార్యదర్శి జొనబోయిన కార్తీక యాదవ్ తదితరులు పాల్గొన్నారు

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI