Sathupalli: ఎమ్మెల్సీ ఓటరు నమోదు వేగవంతం చేయాలి: సండ్ర!

Sathupalli: రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదయ్యేలా బీఆర్ఎస్ శ్రేణులు కృషి చేయాలని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిలుపునిచ్చారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 1 Nov 2026 8:41 PM IST
Sathupalli
X

Sathupalli: ఎమ్మెల్సీ ఓటరు నమోదు వేగవంతం చేయాలి: సండ్ర!

సత్తుపల్లి: ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. సత్తుపల్లి లోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఓటరు నమోదు ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఓటరు నమోదులో ఏవైనా సమస్యలు ఎదురైతే, బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నమోదు కేంద్రాన్ని సంప్రదించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఓటరు నమోదు ప్రక్రియను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సండ్ర వెంకటవీరయ్య కోరారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI