Sathupalli: పట్టభద్రుల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యం: సండ్ర!

Sathupalli: ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించాలని సత్తుపల్లి సన్నాహక సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పిలుపునిచ్చారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 13 Oct 2026 8:52 PM IST
Sathupalli
X

Sathupalli: పట్టభద్రుల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యం: సండ్ర!

సత్తుపల్లి: ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలి. రైతులు, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన సహాయక చర్యలు తక్షణమే అమలు చేయాలని సండ్ర వెంకట వీరయ్య డిమాండ్ చేశారు.

ఖమ్మం–నల్గొండ–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సత్తుపల్లి లోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సత్తుపల్లి పట్టణ, మండల మరియు వేంసూరు మండల ముఖ్య నాయకుల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థి విజయమే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రైవేట్ ఉపాధ్యాయులను ఆదుకుని అండగా నిలిచిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పట్టభద్రుల్లో అసంతృప్తి నెలకొందని, ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే వాతావరణ పరిస్థితులను ముందుగానే అంచనా వేసి, కరువు ముప్పును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. కరువు మండలాల ప్రకటన, ఉపాధి హామీ పనిదినాల పెంపు వంటి అంశాల్లో ఇచ్చిన హామీలను అమలు చేసి రైతులకు, గ్రామీణ ప్రజలకు అండగా నిలవాలని కోరారు.

రాష్ట్రంలో బొగ్గు ఉత్పత్తి జరుగుతున్నప్పటికీ, కేటీపీఎస్‌, మణుగూరు థర్మల్ విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని సమర్థవంతంగా నిర్వహించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. సింగరేణి బొగ్గు వ్యవహారంపై వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు.

రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని సండ్ర వెంకట వీరయ్య పిలుపునిచ్చారు. పట్టభద్రులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులను నేరుగా కలిసి వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు, పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దొడ్డ శంకర్రావు కోసం పూడి మహేష్ శీలప రెడ్డి హరికృష్ణ రెడ్డి మందలపు ప్రభాకర్ మల్లూరి అంకమరాజు వల్లభనేని పవన్ చాంద్ పాషా ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI