Sathupalli:సత్తుపల్లి మండలంలో కాంగ్రెస్ నాయకుల సందడి!
Sathupalli: సత్తుపల్లి మండలం బేతుపల్లిలో ఏసూరి లక్ష్మి ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్.
Sathupalli:సత్తుపల్లి మండలంలో కాంగ్రెస్ నాయకుల సందడి!
Sathupalli: సత్తుపల్లి మండలం బేతుపల్లి గ్రామానికి చెందిన ఏసూరి లక్ష్మి గారి నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నూతన గృహాన్ని సందర్శించి, గృహ యజమాని ఏసూరి లక్ష్మి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద, నిరుపేద కుటుంబాలకు సొంతింటి కల సాకారం అవుతుందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, సత్తుపల్లి మండల కాంగ్రెస్ నాయకులు, బేతుపల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




