Sathupalli: జేవీఆర్ డిగ్రీ కళాశాల 50 వసంతాల స్వర్ణోత్సవం!
Sathupalli:సత్తుపల్లి జేవీఆర్ డిగ్రీ కళాశాల 50 వసంతాల గోల్డెన్ జూబ్లీ పూర్వ విద్యార్థులు తరలిరావాలని విశ్రాంత ఉపాధ్యాయుడు గోపిశెట్టి పిలుపు కృష్ణారెడ్డి రూ.50,116 విరాళం.
Sathupalli: జేవీఆర్ డిగ్రీ కళాశాల 50 వసంతాల స్వర్ణోత్సవం!
సత్తుపల్లి: జలగం వెంగళరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల 50 వసంతాల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు ఉత్సాహంగా నిర్వహించుకోవటంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా భాగస్వామ్యం కావాలినీ విశ్రాంత్రిక ఉపాధ్యాయుడు గోపిశెట్టి వెంకటేశ్వరరావు నాయుడు అభిప్రాయపడ్డారు. ఈ క్రమం ఆర్థికం చాలా ముఖ్యం . శ్రమించి పనిచేయటం చాలా అవసరం. ఈ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు విజయ వంతం కావటానికి గౌరవ కృష్ణా రెడ్డి 50;116 రూపాయలు తన వంతు పాత్ర పోషించటం వారి మానవతా వాదానికి గొప్ప నిదర్శనం.
J V R కళాశాల పూర్వ విద్యార్థులు 50 వసంతాల కాలంలో విద్యాభ్యాం చేసినవారు ఉద్యోగాలు వ్యాపారాలు రాజకీయాలు కాంట్రాక్టులు వ్యవసాయాలు చేస్తూ ఆర్థిక స్థితి కలిగిన వారు గొప్ప దయనీయ మనసు కలిగిన వారు ఉన్నారు. ఈ 50 వసంత కాలంలో చదివిన సరస్వతి బిడ్డలు ఒక్క సారి ఆలోచించండి కళాశాలకు కదలండి మారిన జీవితాలను మనసులను ఈ రెండు రోజులు ఆనందంగా సంతోషంగా ఆహ్లాదాన్ని మంచి చెడులు పంచుకుందాం.
దివంగత ముఖ్యమంత్రి శ్రీ జలగం వెంగళరావు దివంగతులు ఉడత నేని సత్యం చిట్లూరి బసవయ్య మనల్ని తీర్చి దిద్దినదివంగత లెక్చరర్స్ దివంగత విద్యాతినివిద్యార్థులను ఒక్కసారి మనసాక్షిగా స్మరించు కొందాం.నాటివిద్యార్థుల క్రమ శిక్షణ పోరాట పటిమను గుర్తు చేసి కొందాం .కీకారణ్యంలో సరస్వతి క్షేత్రం నుండి విశ్వంలో వెలుగులు నింపే చరిత్రను రానున్న తరాలకు వారసత్వంగా తెలియ చేద్దాం.చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచే విధంగా 50 వసంతాల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు ఉత్సాహంగా నిర్వహించుకోవటంలో ప్రతి ఒక్కరూ తమరి భాగస్వామ్యం అన్ని విధాలుగా ఉండాలని కొరుకుతూ విశ్వసిస్తూ.




