Sathupalli: గణేష్ మండపాలను దర్శించుకున్న మంత్రి పొంగులేటి

Sathupalli: సత్తుపల్లి నియోజకవర్గంలో గణేష్ మండపాలను దర్శించుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి. ప్రత్యేక పూజలు, అన్నదానంలో పాల్గొన్న మంత్రి.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 22 Sept 2026 8:16 PM IST
Sathupalli
X

Sathupalli: గణేష్ మండపాలను దర్శించుకున్న మంత్రి పొంగులేటి

సత్తుపల్లి: సత్తుపల్లి నియోజకవర్గంలో నిర్వహిస్తున్న గణేశ నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా కల్లూరు పెనుపల్లి సత్తుపల్లి మండలాలలో ఏర్పాటు చేసిన వినాయక మందిరాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

గణనాథుని నవరాత్రుల ఉత్సవాలను నియోజకవర్గంలో రకరకాల సెట్టింగ్ లతో మందిరాలు ఏర్పాటు చేసి అందులో గణనాథుని కొలువు తీర్చి పూజలు నిర్వహిస్తున్నారు భక్తులు, ఉత్సవ కమిటీ వారు...కల్లూరు ఖాన్ ఖాన్ పేట వద్ద గల వినాయకునిని, పెనుబల్లి ప్రధాన సెంటర్లో లో గల గణనాథునిని, సత్తుపల్లి పట్టణంలో కృష్ణ మందిరం వద్ద గల లంబోదరుడుని, జూపల్లి హాస్పిటల్ రోడ్ లో గల విఘ్నేశ్వరుడిని, రామాలయం వద్ద గల లంభోదరుడుని, జేవిఆర్ పార్క్ ఎదురుగా గల గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

ప్రతిచోట గణేష నవరాత్రుల ఉత్సవ కమిటీ వారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. పలు గణపతి మందిరాల్లో అన్నదాన కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు.

ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ విఘ్నేశ్వరునిని భక్తులు వారి కుటుంబ సభ్యులు అలానే రాష్ట్ర ప్రజలు చల్లగా ఉండాలని కోరిన కోరికను గణనాథుడు నెరవేరుస్తాడనే నమ్మకం తనకు ఉందని తెలుపుతూ నవరాత్రులను నిర్వహిస్తున్న కమిటీలకు వారికి సహకరిస్తున్న భక్తజనులకు అభినందనలు తెలియజేశారు . ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ కాంగ్రెస్ నాయకులు గాదే చెన్న కేశవరావు ఉడుతనేని అప్పారావు మందపాటి ముత్తారెడ్డి కొత్తూరు ప్రభాకర్ రావు తోట సుజల రాణి గణేష్ సత్తుపల్లి మున్సిపాలిటీ చైర్ పర్సన్ రెహనా కమల్ భాష బొంతు వేణు బత్తుల భరత్ మల్లూరు దిలీప్ నరేంద్ర బత్తుల పవన్ పొంగులేటి మట్ట అభిమానులు పాల్గొన్నారు

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI