Sathupalli: ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ మట్టా

Sathupalli: సత్తుపల్లిలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, మున్సిపల్ చైర్‌పర్సన్ రేహానా బేగం. బాధితుడికి పరామర్శ.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 22 Oct 2026 10:12 PM IST
Sathupalli
X

Sathupalli: ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ మట్టా

సత్తుపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సొంతింటి కల నెరవేరిన లబ్ధిదారుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోందని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అన్నారు.

సత్తుపల్లి పట్టణంలోని 12వ వార్డు ద్వారకాపురి కాలనీ, రోడ్ నంబర్‌ 6లో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారురాలు బూరుగు లలిత నిర్వహించిన గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, సత్తుపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ రేహానా బేగం కమల్ పాషా పాల్గొని లలిత కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంత ఇల్లు ఎంతో భరోసానిస్తుందని, ఇందిరమ్మ ఇళ్ల పథకం అర్హులైన పేదల సొంతింటి కలను సాకారం చేయడానికి దోహదపడుతోందని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులకు ప్రజల తరఫున ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారు.

అనారోగ్యంతో బాధపడుతున్న లక్ష్మణాచారికి పరామర్శ

అనంతరం ద్వారకాపురి కాలనీలో ఇటీవల గుండెకు స్టెంట్ వేయించుకున్న ఫోనుగంటి లక్ష్మణాచారిని ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సంతోషాల్లో, కష్టాల్లో భాగస్వాములవడం సామాజిక బాధ్యతకు నిదర్శనంగా నిలుస్తుంది.

ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం, అనారోగ్యంతో ఉన్న వ్యక్తి పరామర్శ ద్వారా ఎమ్మెల్యే స్థానిక ప్రజలతో మమేకమయ్యారు. ఈ కార్యక్రమంలో గాదే చెన్నకేశవరావు కమల్ భాష దామెర రమేష్ నాగేశ్వరావు బత్తుల భరత్ మల్లూరి దిలీప్ మట్టా చెన్నారావు ప్రభాకర్ రెడ్డి గఫార్ కంటే అప్పారావు నాగుల మేరా అనిల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI