Sathupalli: ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం ఎమ్మెల్యే రాగమయి

Sathupalli: సత్తుపల్లిలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం. కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని గెలిపించాలని ఎమ్మెల్యే రాగమయి, ఎంపీ రఘురామారెడ్డి పిలుపు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 17 Oct 2026 11:10 PM IST
Sathupalli
X

Sathupalli: ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం ఎమ్మెల్యే రాగమయి

సత్తుపల్లి: సత్తుపల్లి పట్టణం - ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో -ఎమ్మెల్సీ ఎన్నికలు సందర్బంగా సత్తుపల్లి నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశ కార్యక్రమం లో పాల్గొని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువత కు పలు సలహాలు, సూచనలు తెలియజేసారు.

రాంరెడ్డి సర్వోత్తమ రెడ్డి ని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ విజయం తో మనం అందరం గెలిపించుకోవాలి అని కోరారు.... ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజలకు తెలియజేసి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ని గెలిపించాలి అని తెలిపారు.

ప్రతి ఒక్కరూ మీ పట్టణాల్లో, గ్రామాల్లో, వార్డుల్లో అర్హులు గల అందరిని ఎన్నికలు కోసం ఓటర్ ఆన్లైన్ చేపించాలి అని కాంగ్రెస్ శ్రేణులకు తెలియజేసిన .. సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి , రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ మరియు ఎంపీ రఘు రాం రెడ్డి మరియు మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మి నారాయణ ..ఈ సందర్బంగా ఉప ముఖ్య మంత్రి బట్టి కి, మంత్రివర్యులు తుమ్మలకి, శ్రీ పొంగులేటి కి, ఎంపీ శ్రీ రఘు రాం రెడ్డి కి ధన్యవాదములు తెలియజేసారు.

సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి గారు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ మరియు ఖమ్మం జిల్లా ఎంపీ సహాయం రఘు రాం రెడ్డి. ఈ కార్యక్రమం లో సత్తుపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు యూత్, మహిళలు సర్పంచ్ లు, ఉపసర్పంచ్ లు, వార్డు నెంబర్స్, కౌన్సిలర్స్ పాల్గొన్నారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI