Sathupalli: సత్తుపల్లి జేవీఆర్‌లో వన మహోత్సవం.. పాల్గొన్న ఎమ్మెల్యే రాగమయి
Sathupalli: ఖమ్మం జిల్లా సత్తుపల్లి జేవీఆర్‌లో జరిగిన 77వ వన మహోత్సవంలో ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి పాల్గొన్నారు.
Sathupalli: సత్తుపల్లి జేవీఆర్‌లో వన మహోత్సవం.. పాల్గొన్న ఎమ్మెల్యే రాగమయి
సత్తుపల్లి: సత్తుపల్లి జేవీఆర్‌లో నిర్వహించిన 77వ వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మట్టా రాగమయి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మొక్కలు నాటిన ఆమె, చెట్ల పెంపకం ద్వారా భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని పేర్కొన్నారు.
ప్రస్తుత కాలంలో పిల్లలు మొబైల్ ఫోన్లకు ఎక్కువగా బానిసలవుతున్నారని, తల్లిదండ్రులు వారిని మంచి అలవాట్ల వైపు మళ్లించాల్సిన అవసరం ఉందన్నారు. ఎలాంటి చెడు అలవాట్లకు బానిసలు కాకుండా, క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు.
వన మహోత్సవం ఉద్దేశం కేవలం మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించడం కూడా అని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజు, కుటుంబ సభ్యుల పుట్టినరోజు సందర్భంగా కనీసం ఒక మొక్కను నాటి, దానిని పరిరక్షించాలని పిలుపునిచ్చారు.
ప్రకృతిని కాపాడుకుందాం చెట్లను పెంచుదాం అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని, మనం చెట్టును కాపాడితే అది మనల్ని కాపాడుతుందని ఆమె అన్నారు. రాబోయే తరాల ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం పర్యావరణ పరిరక్షణకు అందరూ కలిసి పనిచేయాలని ఆమె కోరారు.
విద్యా వ్యాప్తి, పిల్లల భవిష్యత్తు కోసం సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, సమాజాభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.




