Sathupalli: సత్తుపల్లిలో అభివృద్ధి ఎక్కడ?: మున్సిపల్ తీరుపై ఆగ్రహం!

Sathupalli: సత్తుపల్లి మున్సిపాలిటీ 7వ వార్డులో డ్రైనేజీ వ్యవస్థ లేక మురుగుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సమస్యను పరిష్కరించకుంటే పోరాటం ఉధృతం చేస్తామని బీజేపీ హెచ్చరించింది.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 1 Nov 2026 8:36 PM IST
Sathupalli
X

Sathupalli: సత్తుపల్లిలో అభివృద్ధి ఎక్కడ?: మున్సిపల్ తీరుపై ఆగ్రహం!

సత్తుపల్లి: సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో పరిస్థితి చూస్తుంటే మున్సిపాలిటీ అధికారులు ప్రజా సమస్యలను పూర్తిగా గాలికి వదిలేసినట్లు కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగునీరు ఎక్కడికక్కడ నిలిచిపోయి, పిచ్చిమొక్కలు విపరీతంగా పెరిగి, చెత్తాచెదారం పేరుకుపోయి పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. నిల్వ ఉన్న మురుగునీటితో దోమలు పెరిగి, దుర్వాసన వెదజల్లుతూ స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ప్రజలు నివసించే ప్రాంతాల్లో కనీస పారిశుద్ధ్య చర్యలు చేపట్టలేని పరిస్థితిలో మున్సిపాలిటీ పాలన కొనసాగుతుండటం బాధాకరం. ప్రజల నుంచి ఇంటి పన్నులు, ఇతర పన్నులు వసూలు చేయడంలో చూపించే శ్రద్ధ ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ఎందుకు కనిపించడం లేదు?

అధికారులకు ప్రజల సమస్యలు కనిపించడం లేదా? లేక కనిపిస్తున్నా పట్టించుకునే బాధ్యత లేదా? సత్తుపల్లిలో అభివృద్ధి జరిగిందని ప్రచారాలు చేసుకోవడం కాదు.. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి చూపించాలి.

వెంటనే 7వ వార్డులో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి, పిచ్చిమొక్కలను తొలగించి, నిల్వ ఉన్న మురుగునీటిని తొలగించడంతో పాటు, డ్రైనేజీ వ్యవస్థ లేని ప్రాంతాల్లో నూతన డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టి ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపించాలని మున్సిపాలిటీ అధికారులను భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. అధికారులు ఇప్పటికైనా నిర్లక్ష్యాన్ని వీడి ప్రజా సమస్యలను పరిష్కరించాలి. లేనిపక్షంలో ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుంది.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI