Sathupalli: సత్తుపల్లి ప్రాంత కవి "మందపాటి"కి నన్నయ్య కవి జాతీయ పురస్కారం

Sathupalli: సత్తుపల్లి ప్రముఖ కవి మందపాటి సత్యనారాయణరెడ్డికి నన్నయ కవి జాతీయ పురస్కారం. 'సర్వ సీస మహాభారతం' విశిష్ట కావ్య రచనకు దక్కిన అరుదైన గౌరవం.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 7 Sept 2026 7:37 PM IST
Sathupalli
X

Sathupalli: సత్తుపల్లి ప్రాంత కవి "మందపాటి"కి నన్నయ్య కవి జాతీయ పురస్కారం

సత్తుపల్లి: పద్య సాహిత్యంలో విశేష కృషి చేస్తున్న సత్తుపల్లి ప్రాంత కవి , విశ్రాంత ఉపాధ్యాయులు మందపాటి సత్యనారాయణరెడ్డి కి నన్నయ కవి జాతీయ పురస్కారం లభించింది. పొట్టి శ్రీరాములు(నెల్లూరు) జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఏం. వి.రావు ఫౌండేషన్ నిర్వాహకులు ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ, ఎం. విజయలక్ష్మి కవి మందపాటికి ఈ పురస్కారాన్ని అందచేశారు.

పద్య సాహిత్యంలో చేయి తిరిగిన మందపాటి మహా భారతాన్ని పూర్తిగా 2140 సీస పద్యాల్లో సర్వ సీస మహాభారతం పేరుతో రచించారు. కేవలం సీస పద్యాలతోనే మహా భారత కావ్య రచన చేయడం సాహిత్యంలో ఒక నూతన ప్రక్రియగా గుర్తించిన నిర్వాహకులు మందపాటి ఈ పురస్కారం అందచేశారు.

ఈ సందర్భంగా కవి మందపాటినిని సృజన సాహితీ సమాఖ్య, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం తరుపున రామకృష్ణ,వాసు,మధుసూదనరాజు,కేశవరెడ్డి, ప్రకాశరావు అభినందనలు తెలిపారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI

Next Story