Sathupalli: సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి, లారీ లోడింగ్ పెంచాలి!
Sathupalli: సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి పెంచి లారీలకు లోడింగ్ పెంచాలి: జీఎంను కలిసి వినతిపత్రం అందజేసిన కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్, లారీ యూనియన్ నాయకులు.
Sathupalli: సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి, లారీ లోడింగ్ పెంచాలి!
సత్తుపల్లి: సింగరేణి ఏరియాలో బొగ్గు ఉత్పత్తిని పెంచడంతో పాటు లారీ యజమానులకు మరింత లోడింగ్ అవకాశం కల్పించాలని కోరుతూ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్‌ను లారీ యూనియన్ నాయకులతో కలిసి కలిశారు.*
ఈ సందర్భంగా సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్‌తో బొగ్గు ఉత్పత్తి, లోడింగ్ తదితర అంశాలపై చర్చించారు. బొగ్గు ఉత్పత్తిని పెంచి, లారీలకు మరింత లోడింగ్ ఇవ్వడం ద్వారా లారీ యజమానులకు ఉపాధి అవకాశాలు పెరిగేలా చూడాలని మట్టా దయానంద్ గారు కోరారు.
అలాగే లారీ యజమానులు, డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని జనరల్ మేనేజర్‌ను విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో లారీ యూనియన్ నాయకులు,కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.




