Sathupalli: చిలకలగండి ముత్యాలమ్మ ఆలయం వద్ద విద్యార్థుల సందడే సందడి!

Sathupalli: ఖమ్మం జిల్లా సత్తుపల్లి టాలెంట్ స్కూల్ విద్యార్థులు పిక్నిక్‌లో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన చిలకలగండి ముత్యాలమ్మ అమ్మవారి ఆలయాన్ని సందర్శించి సందడి చేశారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 15 Nov 2026 11:01 AM IST
Sathupalli
X

Sathupalli: చిలకలగండి ముత్యాలమ్మ ఆలయం వద్ద విద్యార్థుల సందడే సందడి!

సత్తుపల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రమైన చిలకలగండి ముత్యాలమ్మ అమ్మవారి ఆలయాన్ని టాలెంట్ స్కూల్, సత్తుపల్లి విద్యార్థులు పిక్నిక్‌లో భాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పరిసరాల్లో ఆటపాటలతో సందడి చేస్తూ, పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి అందరినీ అలరించారు.

విద్యార్థులు పాటలు, నృత్యాలు, వివిధ వినోద కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. చదువుతో పాటు ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థుల్లో సృజనాత్మకతను, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని పాఠశాల యాజమాన్యం పేర్కొంది. ఈ పిక్నిక్ విద్యార్థులకు ఆనందాన్ని పంచడంతో పాటు మధురమైన జ్ఞాపకంగా నిలిచింది.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI