Sathupalli: రాఖీ పండక్కి సత్తుపల్లి ఆర్టీసీ డిపోకు రూ.2 కోట్ల బంపర్ ఆదాయం!

Sathupalli: రాఖీ పండుగ సందర్భంగా సత్తుపల్లి ఆర్టీసీ డిపోకు రూ.2.01 కోట్ల ఆదాయం సమకూరింది. గత ఏడాదితో పోలిస్తే రూ.10 లక్షల అదనపు ఆదాయం వచ్చిందని డీఎం తెలిపారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 3 Sept 2026 6:54 AM IST
Sathupalli
X

Sathupalli: రాఖీ పండక్కి సత్తుపల్లి ఆర్టీసీ డిపోకు రూ.2 కోట్ల బంపర్ ఆదాయం!

Sathupalli: రాఖీ పర్వదిన సందర్భంగా సత్తుపల్లి డిపో ఆగస్టు 26వ తేదీ నుండి 31వ తేదీ వరకు 2 కోట్ల 1 లక్ష 30 వేల 786 రూపాయలు ఆదాయం వచ్చినట్లు సత్తుపల్లి డిపో మేనేజర్ గురిజాల లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 26వ తేదీ నుండి 31వ తేదీ వరకు షెడ్యూల్ బస్సులతో పాటు అదనపు బస్సులను కూడా నడిపి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారి వారి గమ్మే స్థానాలకు చేరవేసినట్లు ఆయన తెలిపారు.

మొత్తం 3,08,183 కిలోమీటర్లు బస్సులు తిరగగా 65.32 ఈపీకే,100 ఓ ఆర్ వచ్చినట్లు ఆయన ఈ సందర్భంగా వివరించారు. ప్రతిరోజు ప్రయాణికుల రద్దీ కనుగుణంగా అదనపు బస్సులు నడపడం వలన అధిక ఆదాయం సమకూరినట్లు ఆయన వివరించారూ.

రీజినల్ మేనేజర్ ఏ సరిరామ్ సూచనలతో ప్రతిరోజు తిరిగే వాహనాలకు అదనంగా 543 వాహనాలు నడపడం జరిగింది అని అన్నారు. అదనపు కిలోమీటర్లు మరియు అదనపు బస్సులు నడపడానికి సహకరించిన సత్తుపల్లి టీం సభ్యులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

గత సంవత్సరం రాఖీ తో పోలిస్తే ఈ రాఖీ పౌర్ణమి కి అదనంగా 10 లక్షల రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ గురిజాల లక్ష్మీనారాయణ తోపాటు అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ సాహితి పాల్గొన్నారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI

Next Story