Sathupally: రాష్ట్రస్థాయి మహిళల కబడ్డీలో జిల్లాల జట్ల హోరాహోరీ!

Sathupally: సత్తుపల్లిలో 73వ రాష్ట్రస్థాయి సీనియర్ మహిళల కబడ్డీ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. శుక్రవారం ముగింపు సభకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 29 Oct 2026 7:55 PM IST
Sathupally
X

Sathupally: రాష్ట్రస్థాయి మహిళల కబడ్డీలో జిల్లాల జట్ల హోరాహోరీ!

సత్తుపల్లి: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని రాణి సెలబ్రేషన్ ఫంక్షన్ హాల్‌లో జరుగుతున్న 73వ రాష్ట్రస్థాయి సీనియర్ మహిళల కబడ్డీ పోటీల్లో వివిధ జిల్లాల జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. బుధవారం ప్రారంభమైన ఈ పోటీల్లో క్రీడాకారిణులు చురుకైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నారు. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు పలు ఉత్కంఠభరిత మ్యాచ్‌లు జరిగాయి.

బుధవారం జరిగిన పోటీల ఫలితాలు

ఖమ్మం జట్టు 45–5 స్కోరుతో పెద్దపల్లి జట్టుపై ఘన విజయం సాధించింది. రంగారెడ్డి జట్టు 55–25 స్కోరుతో ములుగుపై, హైదరాబాద్ జట్టు 36–8 స్కోరుతో మెదక్‌పై విజయం సాధించాయి. నాగర్ కర్నూల్ జట్టు 39–29 స్కోరుతో వరంగల్‌పై గెలుపొందింది.

సాయంత్రం జరిగిన మ్యాచ్‌ల్లో జనగామ జట్టు 29–22 స్కోరుతో మంచిర్యాలపై, సిద్దిపేట జట్టు 48–24 స్కోరుతో ఆసిఫాబాద్‌పై, నల్గొండ జట్టు 43–23 స్కోరుతో నారాయణపేటపై విజయం సాధించాయి. గద్వాల జట్టు 47–28 స్కోరుతో హనుమకొండపై, కరీంనగర్ జట్టు 58–21 స్కోరుతో కామారెడ్డిపై, సూర్యాపేట జట్టు 36–3 స్కోరుతో ఆదిలాబాద్‌పై, మేడ్చల్ జట్టు 46–29 స్కోరుతో సంగారెడ్డిపై గెలుపొందాయి.

గురువారం జరిగిన మ్యాచ్‌ల ఫలితాలు

గురువారం ఉదయం నుంచి జరిగిన పోటీల్లో సిద్దిపేట జట్టు 35–33 స్కోరుతో హనుమకొండపై, హైదరాబాద్ జట్టు 31–5 స్కోరుతో ఆదిలాబాద్‌పై విజయం సాధించాయి. రంగారెడ్డి జట్టు 49–4 స్కోరుతో యాదాద్రి భువనగిరిపై, వరంగల్ జట్టు 39–35 స్కోరుతో నిర్మల్‌పై, ఖమ్మం జట్టు 40–8 స్కోరుతో సంగారెడ్డిపై గెలుపొందాయి.

నల్గొండ జట్టు 40–6 స్కోరుతో భూపాలపల్లిపై, జనగామ జట్టు 36–13 స్కోరుతో హైదరాబాద్-1 జట్టుపై విజయం సాధించాయి. ఆసిఫాబాద్ జట్టు 53–43 స్కోరుతో హనుమకొండపై, భద్రాద్రి కొత్తగూడెం జట్టు 45–12 స్కోరుతో కరీంనగర్‌పై గెలుపొందాయి.

ఇతర మ్యాచ్‌ల్లో సిద్దిపేట జట్టు 42–36 స్కోరుతో సిరిసిల్లపై, సూర్యాపేట జట్టు 36–12 స్కోరుతో మెదక్‌పై విజయం సాధించాయి. మహబూబ్‌నగర్ జట్టు 38–36 స్కోరుతో ములుగుపై, నిజామాబాద్ జట్టు 32–31 స్కోరుతో నాగర్ కర్నూల్‌పై ఉత్కంఠభరిత విజయం సాధించాయి. జగిత్యాల జట్టు 28–20 స్కోరుతో నారాయణపేటపై, వనపర్తి జట్టు 30–29 స్కోరుతో మంచిర్యాలపై గెలుపొందాయి. మరో మ్యాచ్‌లో గద్వాల జట్టు 37–13 స్కోరుతో సిద్దిపేటపై విజయం సాధించింది.

శుక్రవారం సాయంత్రంతో ముగియనున్న పోటీలు

రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల మహిళా క్రీడాకారిణులు పాల్గొంటున్న ఈ పోటీల్లో మిగిలిన మ్యాచ్‌లు ఈ నెల 30వ తేదీ శుక్రవారం సాయంత్రం వరకు కొనసాగనున్నాయి. పోటీల ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విజేత జట్లకు బహుమతులు ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

మహిళా క్రీడాకారిణుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు రాష్ట్రస్థాయి కబడ్డీ ప్రతిభను వెలికితీయడానికి ఈ పోటీలు వేదికగా నిలుస్తున్నాయి.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI