Sathupally: కాంగ్రెస్ సోషల్ మీడియా నియోజకవర్గ స్థాయి సమావేశం!
Sathupally: సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ సోషల్ మీడియా సమావేశం.
Sathupally: కాంగ్రెస్ సోషల్ మీడియా నియోజకవర్గ స్థాయి సమావేశం!
Sathupally: ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ సోషల్ మీడియా సమావేశం బుధవారం సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారo mla డాక్టర్ మట్ట రాగమై దయానంద్ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించారు
ఈ సమావేశంలో టీపీసీసీ సోషల్ మీడియా చైర్మన్ పెట్టేం నవీన్, రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. అలాగే సత్తుపల్లి నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ కిషోర్ పోతురాజు, నియోజకవర్గంలోని ఐదు మండలాల, టౌన్ సోషల్ మీడియా కోఆర్డినేటర్లు, గ్రామ శాఖల సోషల్ మీడియా అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులను ప్రజలకు స్పష్టంగా వివరించేలా సోషల్ మీడియా కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
టీపీసీసీ సోషల్ మీడియా చైర్మన్ పెట్టేం నవీన్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సోషల్ మీడియా కార్యకర్తలు చురుకైన పాత్ర పోషించాలని సూచించారు.
రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా. మట్టా దయానంద్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాలను కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలు వాస్తవాలతో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజలకు వాస్తవాలను చేరవేయడంలో సోషల్ మీడియా కీలక వేదికగా మారిందని, పార్టీ శ్రేణులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.
సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యక్రమాలను మరింత బలోపేతం చేయడం, పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం, సోషల్ మీడియా కార్యకర్తల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ, మండల, టౌన్ మరియు గ్రామ స్థాయి సోషల్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.




