Penuballi: పెనుబల్లిలో జ్యూట్ బ్యాగ్ తయారీ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే!

Penuballi: ఖమ్మం జిల్లా పెనుబల్లిలో జ్యూట్ బ్యాగ్ తయారీ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి. మహిళల సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 6 Sept 2026 2:50 PM IST
Penuballi
X

Penuballi: పెనుబల్లిలో జ్యూట్ బ్యాగ్ తయారీ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే!

Penuballi: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయంలో ఇందిరా మహిళా శక్తి, స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యుల కోసం సెర్ఫ్, SBI–RSETI ఖమ్మం మరియు ఉషా కిరణాలు మండల సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జ్యూట్ బ్యాగ్ తయారీ శిక్షణ కేంద్రాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే శ్రీమతి మట్టా రాగమయి దయానంద్ గారు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ గారు మాట్లాడుతూ, మహిళల ఆర్థిక స్వావలంబన, సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు.

మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని, స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని ఎమ్మెల్యే గారు ఆకాంక్షించారు. మహిళలను కోటీశ్వరులను చేయడమే ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆశయమని అన్నారు.

మహిళా సంఘాల ద్వారా సున్నా వడ్డీ రుణాలు, ఉచిత బస్సు ప్రయాణం, సన్న బియ్యం, పెట్రోల్ బంకుల ఏర్పాటు వంటి పలు కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందని వివరించారు. జ్యూట్ బ్యాగ్ తయారీ వంటి నైపుణ్య శిక్షణలను సద్వినియోగం చేసుకొని మహిళలు స్వయం ఉపాధి పొందాలని కోరారు.

ఈ కార్యక్రమంలో APM, APO, ఇన్‌చార్జ్ MPDO, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పంది వెంకటేశ్వరరావు, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు బల్లి మనీషా, ప్రజాప్రతినిధులు, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI

Next Story