Sathupally: సత్తుపల్లిలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమం

Sathupally: సత్తుపల్లి మండలం బేతుపల్లిలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమం ఘనంగా జరిగింది.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 4 May 2026 6:30 PM IST
Sathupally
X

Sathupally: సత్తుపల్లిలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమం

Sathupally: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో వ్యవసాయ కళాశాల అశ్వరావుపేట అసో సియేట్ డీన్ డా. జె. హేమంత కుమార్, శాస్త్రవేత్తలు డా. పి. నీలిమ మరియు డా. ఎ. శ్రీజన్ సత్తుపల్లి మండలంలోని బేతుపల్లి గ్రామంలో ఈరోజు (04-05-2026) “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమాన్ని 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా వ్యవసాయ దినోత్సవం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సత్తుపల్లి ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్ గారు మాట్లాడుతూ రైతులు ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా సేంద్రీయ వ్యవసాయం, సిఫారసు చేసిన మేరకు ఎరువుల యాజమాన్యం, పంట మార్పిడి, సాగునీటి ఆదా వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రైతులను కోరారు.

కార్యక్రమానికి ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ నుండి విశిష్ట అతిథిగా విచ్చేసిన విద్యార్థుల వ్యవహరాల డీన్ డా. చల్లా వేణుగోపాల్ రెడ్డి పాల్గొని రైతులు పంట మార్పిడి పాటించాలని వరి పంట యొక్క విస్తీర్నాన్ని తగ్గించాలని ఆయిల్ పామ్ పంట సాగును పెంచాల్సిన అవసరం చాలా ఉందని కోరారు.

ఈ సందర్భంగా వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డా. జై హేమంత్ కుమార్ మాట్లాడుతూ రైతు సోదరులు ఈ ఆరు ముఖ్య అంశాలపై దృష్టి సారించి, రాబోయే వానాకాల పంట సాగుకు సమాయత్తం కావాలని సూచించారు. అలాగే వివిధ పంటల్లో చీడపీడల యాజమాన్యం గురించి రైతులకు వివరిస్తూ తగు సూచనలు అందించారు.

డా. ఎ. శ్రీజన్ సేంద్రియ వ్యవసాయం యొక్క ప్రాముఖ్యతను రైతులకు వివరించుటంతోపాటు మార్కెట్లో గిరాకీ ఉన్న వరిరకాలతో పంటలను సాగు చేయడం ద్వారా రైతులు అధిక లాభాలు పొందవచ్చని తెలిపారు. డా. పి. నీలిమ ఆయిల్ పామ్ పంట సాగు మరియు అంతర పంటలు చీడపీడల గురించి వివరించి రైతుల సందేహాలకు తగిన పరిష్కారాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపాల్టీ చైర్మెన్ శ్రీమతి రెహానా, వ్యవసాయ సహాయ సంచాలకులు శ్రీ శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ అధికారి వై. శ్రీనివాస రావు, బేతుపల్లి సర్పంచ్ డి. రాజేంద్రప్రసాద్, ఉప సర్పంచ్ చెన్నకేశవులు, వ్యవసాయ విస్తరణాధికారి వాసంతి తదితరులు పాల్గొన్నారు. అలాగే 150 మంది రైతు సోదర సోదరీమణులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI

Next Story