Sathupally: చిన్నారి మెరుగైన వైద్యానికి రూ.4 లక్షల ఎల్‌ఓసీ అందజేత

Sathupally: మల్లారం గ్రామానికి చెందిన చిన్నారి తులసి వైద్యానికి సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ రూ.4 లక్షల ఎల్‌ఓసీ అందజేత.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 31 Oct 2026 11:32 PM IST
Sathupally
X

Sathupally: చిన్నారి మెరుగైన వైద్యానికి రూ.4 లక్షల ఎల్‌ఓసీ అందజేత

సత్తుపల్లి: తల్లాడ మండలం మల్లారం గ్రామానికి చెందిన నాలుగేళ్ల చిన్నారి మేడి తులసికి మెరుగైన వైద్యం అందించేందుకు సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ చొరవ తీసుకున్నారు. ఈ మేరకు రూ.4 లక్షల విలువైన ఎల్‌ఓసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్)ను చిన్నారి కుటుంబ సభ్యులకు అందజేశారు.

సత్తుపల్లి పట్టణంలోని ద్వారకాపురి కాలనీ, రోడ్ నంబర్ 7లో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ సహాయ పత్రాన్ని అందించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మెరుగైన వైద్య చికిత్సకు ఆర్థిక సహాయం అందేలా ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ చూపారు.

ఈ సందర్భంగా చిన్నారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI