Sathupally: పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే రాగమయి
Sathupally: సత్తుపల్లి ఎన్టీఆర్ కాలనీలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే మట్టా రాగమయి. రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశం.
Sathupally: పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే రాగమయి
సత్తుపల్లి: సత్తుపల్లి పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో ఉన్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలు, మందుల నిల్వలు, ఆసుపత్రి పరిసరాలు, సిబ్బంది పనితీరును పరిశీలించారు.
వైద్యం కోసం వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సంబంధిత వైద్యులు, సిబ్బందికి సూచించారు. ప్రజారోగ్య పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ విధుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ మహమ్మద్ రెహనా కమల్ పాషా, వార్డు కౌన్సిలర్లు, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాదె చెన్నకేశవరావు, పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




