Sathupally: ఇందిరా గాంధీకి నివాళులర్పించిన ఎమ్మెల్యే మట్టా రాగమయి
Sathupally: సత్తుపల్లిలో ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్.
Sathupally: ఇందిరా గాంధీకి నివాళులర్పించిన ఎమ్మెల్యే మట్టా రాగమయి
సత్తుపల్లి: భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి, ఉక్కు మహిళగా పేరుగాంచిన స్వర్గీయ ఇందిరా గాంధీ 42వ వర్ధంతి సందర్భంగా సత్తుపల్లి పట్టణంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న ఇందిరా గాంధీ విగ్రహానికి సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం దేశానికి ఇందిరా గాంధీ అందించిన సేవలను, దేశ ఐక్యత, సమగ్రత కోసం ఆమె చేసిన కృషిని స్మరించుకున్నారు. దేశ అభివృద్ధి కోసం ఆమె తీసుకున్న నిర్ణయాలు, ప్రజాసేవ పట్ల చూపిన నిబద్ధత నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మహమ్మద్ రెహనా కమల్ పాషా, మార్కెట్ కమిటీ అధ్యక్షులు నరసింహారావు, దేవి శ్రీనివాసరావు, పింగళి శ్యామల, మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ బొంతు సుమలత వేణు, వార్డు కౌన్సిలర్లు, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గాదె చెన్నకేశవరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




