Sathupally: సత్తుపల్లిలో ఘనంగా పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు
Sathupally: సత్తుపల్లిలో పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. బస్టాండ్ నుంచి బైక్ ర్యాలీ నిర్వహించి, రింగ్ సెంటర్‌లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.
Sathupally: సత్తుపల్లిలో ఘనంగా పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు
సత్తుపల్లి: ఖమ్మం జిల్లా సత్తుపల్లి లో జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సత్తుపల్లి పట్టణంలో జనసేన నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానుల ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సత్తుపల్లి బస్టాండ్ నుండి బైక్ ర్యాలీ ప్రారంభమై, పాత బస్టాండ్ మీదుగా తిరిగి సత్తుపల్లి బస్టాండ్ వరకు ఉత్సాహంగా కొనసాగింది. ర్యాలీలో జనసేన కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహం, రింగ్ సెంటర్ వద్ద కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించి, శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ టౌన్ అధ్యక్షులు ఆళ్ళ నరేష్ , మండల అధ్యక్షుడు సింగపోగు అప్పారావు, మున్సిపల్ కౌన్సిలర్ తోట సుజలా రాణి, బత్తుల పవన్, డాక్టర్ రామ్ హరీష్ కొండూరి , మిట్టపల్లి సత్యనారాయణ, మహమ్మద్ సైఫ్, సంపటం వంశీకృష్ణ, నవీన్, పవన్, గణేష్, ఆఫ్రిది, తదితరులు
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రజా సేవ, సామాజిక బాధ్యత మరియు ప్రజల సంక్షేమం కోసం శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కృషి స్ఫూర్తిదాయకమని అన్నారు. జనసేన కార్యకర్తలు భవిష్యత్తులో కూడా ప్రజా సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటామని తెలిపారు.
కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు సహకరించిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.




