Sathupally: వన సంరక్షణ సమితి సభ్యులకు జీవనోపాధులపై శిక్షణ
Sathupally: సత్తుపల్లిలో నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వన సంరక్షణ సమితి సభ్యులు, అటవీ సిబ్బందికి సాంకేతిక ఆవిష్కరణలు, జీవనోపాధుల అభివృద్ధిపై శిక్షణ నిర్వహించారు.
Sathupally: వన సంరక్షణ సమితి సభ్యులకు జీవనోపాధులపై శిక్షణ
సత్తుపల్లి: వన సంరక్షణ సమితి సభ్యులు జీవనోపాధుల ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో వన సంరక్షణ సమితి సభ్యులకు మరియు అటవీ క్షేత్రస్థాయి సిబ్బందికి క్షేత్రస్థాయి సాంకేతిక ఆవిష్కరణల సద్వినియోగం, జీవనోపాధుల అభివృద్ధి మరియు ఆర్థిక స్వావలంబనపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వన సంరక్షణ సమితి సభ్యులు అడవుల పరిరక్షణలో కీలక పాత్ర పోషించడంతో పాటు, అందుబాటులో ఉన్న అటవీ వనరులను చట్టబద్ధంగా, పర్యావరణానికి హాని కలగకుండా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సాంకేతిక ఆవిష్కరణలను ఉపయోగించుకొని స్థానికంగా లభించే వన ఉత్పత్తుల ఆధారంగా వివిధ జీవనోపాధి మార్గాలను అభివృద్ధి చేసుకోవాలని, స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని వివరించారు.
వన సంరక్షణ సమితి సభ్యులు కేవలం అడవుల పరిరక్షణకే పరిమితం కాకుండా, జీవనోపాధుల ద్వారా తమ కుటుంబాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకొని స్వావలంబన సాధించాలని తెలిపారు. అటవీ శాఖ క్షేత్రస్థాయి సిబ్బంది, వన సంరక్షణ సమితి సభ్యులకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణ మరియు మార్గదర్శకత్వం అందిస్తూ వారి ఆర్థిక అభివృద్ధికి సహకరించాలని సూచించారు.
వన సంరక్షణతో పాటు గ్రామీణ ప్రజల ఆర్థిక అభివృద్ధి సాధించినప్పుడే స్థిరమైన అటవీ సంరక్షణ సాధ్యమవుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో సత్తుపల్లి రేంజ్ అధికారి యల్లయ్య, తల్లాడ రేంజ్ అధికారి ఉమా,నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ప్రతినిద్దులు రాహుల్ ప్రకాష్, జోగేంద్ర పాత్రు, దివ్యాన్ షు, అటవీ సిబ్బంది మరియు వనసంరక్షణ సమితి సభ్యులు పాల్గొన్నారు.




