Sattupalli: సత్తుపల్లిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు!
Sattupalli: సత్తుపల్లిలో సీపీఎం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించి, ఆమె పోరాట స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాడాలని నేతలు పిలుపునిచ్చారు.
Sattupalli: సత్తుపల్లిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు!
Sattupalli: చిట్యాల ఐలమ్మ జయంతిని సిపిఐ ఎం సత్తుపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో శనివారం సత్తుపల్లి ప్రజాసంఘాల కార్యాలయంలో ఘనంగా చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాజిరి శ్రీనివాస్ మాట్లాడుతూ భూమి, పేదల హక్కుల కోసం చిట్యాల ఐలమ్మ సాగించిన పోరాటం తెలంగాణ ప్రజలకు స్ఫూర్తిదాయకమన్నారు. భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా ధైర్యం నిలబడి పేదలు, రైతులు, కూలీల హక్కుల కోసం ఆమె పోరాడరని తెలిపారు.
చిట్యాల ఐలమ్మ పోరాటం కేవలం ఒక వ్యక్తి పోరాటం కాదని, అణగారిన వర్గాల ఆత్మగౌరవం, భూమి, జీవన హక్కుల కోసం సాగిన పోరాటం అని పేర్కొన్నారు. మహిళలు కూడా సామాజిక అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడగలరని ఆమె జీవితం నిరూపించిందన్నారు. ప్రస్తుతం కూడా పేదలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, ఇళ్ల స్థలాలు, ఉపాధి, సాగు భూమి, పింఛన్లు, తదితర సమస్యల పరిష్కారం కోసం ప్రజలను ఐక్యం చేసి పోరాటాలు కొనసాగిస్తామని అన్నారు.
ఐలమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు కువ్వా రపు లక్ష్మణరావు, బండి వేలాద్రి, కావూరి వెంకటేశ్వరరావు, రాములు, రామకృష్ణ, ఆంజనేయులు, బాలస్వామి, రాము, లక్ష్మి, విజయ్ తదితరులు పాల్గొన్నారు.




