Sattupalli: మదర్ తెరిసా ఇంజనీరింగ్ కాలేజీలో ఏఐ ఆధారిత వర్క్‌షాప్

Sattupalli: సత్తుపల్లి మదర్ తెరిసా ఇంజనీరింగ్ కళాశాలలో మారుతున్న ప్రపంచం - ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంశంపై విద్యార్థులకు అవగాహన సదస్సు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 22 Aug 2026 8:03 PM IST
Sattupalli
X

Sattupalli: మదర్ తెరిసా ఇంజనీరింగ్ కాలేజీలో ఏఐ ఆధారిత వర్క్‌షాప్

సత్తుపల్లి: ఖమ్మం జిల్లా సత్తుపల్లి లో మదర్ తెరిసా అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం నాడు కళాశాలలో వివిధ భాగాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థిని, విద్యార్థులకు ప్రముఖ రిసోర్స్ పర్సన్ ప్రొఫెసర్. వివేక్ రాజశేఖర్ ఎఫ్. సి. ఎం. ఎ ,డి.లిట్.

చార్టర్డ్ పబ్లిక్ ఫైనాన్స్ అకౌంటెంట్ (యూకే) వారి ఆధ్వర్యంలో వేగంగా మారుతున్న ప్రపంచంలో విద్యార్థుల భవిష్యత్తును కాలానుగుణంగా ఎలా తీర్చిదిద్దుకోవాలి అనే అంశంపై ఒక్కరోజు "ఇంటరాక్టివ్ వర్క్ షాప్" నిర్వహించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చలసాని. హరికృష్ణ తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్ మాట్లాడుతూ నేటి ఆధునిక పోటీ ప్రపంచంలో విద్యార్థులు వివిధ రంగాలలో నిష్ణాతులుగా నిలబడాలంటే విద్యార్థి దశ నుండి క్రమశిక్షణ తో కూడిన బోధన, పోటీతత్వం లతో ఒక నిర్దేశిత లక్ష్యాన్ని ఏర్పరచుకొని దానిని సాధించాలన్నారు.

నేటి ఆధునిక పోటీ ప్రపంచంలో అనేక దేశాలు విద్యా, వైద్యం ,వ్యవసాయం, పారిశ్రామిక, ఉపాధి కల్పన, బ్యాంకింగ్ , శాస్త్ర సాంకేతిక మరియు రక్షణ రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వ్యవస్థలను అనుసంధానం చేసి స్వయం సమృద్ధిని సాధిస్తున్నాయి అన్నారు.

అదేవిధంగా నేడు భారతదేశం అన్ని రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగిస్తూ ప్రపంచంలో అగ్రదేశాలతో పోటీ పడుతూ మెరుగైన ఆర్థిక వృద్ధి రేటును సాధిస్తుంది అన్నారు.

ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రెసిడెంట్ శ్రీ కొత్తూరు ప్రభాకర్ రావు గారు మాట్లాడుతూ మదర్ తెరిసా ఇంజనీరింగ్ కళాశాల గ్రామీణ వాతావరణం లో ఉన్న విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో 2001లో స్థాపించడం జరిగింది అన్నారు. ఈ 25 సంవత్సరాల కాలంలో తమ కళాశాలలో అన్ని విభాగాలలో విద్యనభ్యసిస్తురూ.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చలసాని. హరికృష్ణ మదర్ తెరిసా విద్యాసంస్థల ప్రెసిడెంట్ శ్రీ చలసాని. సాంబశివరావు, వైస్ ప్రెసిడెంట్ శ్రీ కొత్తూరు. ప్రభాకర్ రావు, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జి. ఉదయ్ కిరణ్ భార్గవ్, ఐక్యూఏసి కోఆర్డినేటర్ డాక్టర్ ఎం. వి. రామచంద్ర రావు, వివిధ విభాగాల అధిపతులు అధ్యాపకులు మరియు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI

Next Story