Singareni: దేశ ఇంధన భద్రతకు బొగ్గుతో పాటు పునరుత్పాదక విద్యుత్ లో కూడా సింగరేణి కృషి
Singareni: హైదరాబాద్‌లో జరిగిన ఇండియన్ ఎనర్జీ సమ్మిట్‌లో సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి మాట్లాడారు.
Singareni: దేశ ఇంధన భద్రతకు బొగ్గుతో పాటు పునరుత్పాదక విద్యుత్ లో కూడా సింగరేణి కృషి
సింగరేణి: రాష్ట్ర దేశ ఇంధన భద్రతకు సింగరేణి సంస్థ తగినంత బొగ్గును అందించడంతో పాటు పునరుత్పాతక విద్యుత్తు రంగంలో కూడా తన వంతు కృషి చేస్తుందని సింగరేణి సంస్థ ఛైర్మన్ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి తెలిపారు. హైదరాబాద్ లో జరుగుతున్న ఇండియన్ ఎనర్జీ సమ్మిట్ అండ్ ఎక్స్ పో కార్యక్రమంలో భాగంగా బుధవారం జరిగిన భారత ఇంధన భద్రత విద్యుత్ ఉత్పత్తి అనే గోష్టిలో ఆయన పాల్గొన్నారు.
ప్రభుత్వ సంస్థ అయిన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ దశాబ్దాల కాలంగా దేశ ఇంధన అవసరాలకు తనవంతుగా బొగ్గు అందిస్తూ వస్తుందని, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చడానికి రాష్ట్ర జెన్ కో మరియు ట్రాన్స్ కో కలిసి సమష్టిగా కృషి చేస్తుందన్నారు. సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యలో భాగంగా థర్మల్ విద్యుత్, సోలార్ విద్యుత్ మరియు క్రిటికల్ మినరల్ రంగంలోకి కూడా ప్రవేశించిందని, అయినప్పటికీ దేశంలో బొగ్గు ఆధారిత విద్యుత్తు ఉత్పత్తికి మరో నాలుగు దశాబ్దాల పాటు డిమాండ్ ఉండే అవకాశం ఉందన్నారు. కనుక సింగరేణి సంస్థ రానున్న కాలంలో బొగ్గు ఉత్పత్తి పెంచడానికి కృషి చేస్తుందని అలాగే పునరుత్పాతక ఇంధన రంగంలో కూడా తన వంతు బాధ్యత నిర్వహిస్తుందని తెలిపారు.
ఈ చర్చ గోష్టికి ప్రొఫెసర్ పవన్ కుమార్ పరనంది సమన్వయ కర్తగా వ్యవహరించారు. ఈ ఎనర్జీ సమ్మిట్ కు తెలంగాణ ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ నవీన్ మిట్టల్ హాజరుకాగా... ప్యానెల్ డిస్కషన్ లో సింగరేణి ఛైర్మన్ తో పాటు తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ సీఎండీ డాక్టర్ ఎస్. హరీష్, రాజస్థాన్ రాజ్య విద్యుత్ ఉత్పాదన నిగం లిమిటెడ్ సీఎండీ శ్రీ దేవేంద్ర శృంగి, ఎన్టీపీసీ సౌత్ రీజినల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అజయ్ శర్మ, గ్రిడ్ కో లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సత్యప్రియ రథ్, ఒడిశా పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ శ్రీ కేదార్ రంజన్ పాండు, ఛత్తీస్ ఘడ్ స్టేట్ పవర్ జనరేషన్ కంపెనీ లిమిటెడ్ ఎండీ శ్రీ సంజీవ్ కుమార్ కటియార్ తదితరులు పాల్గొన్నారు.




