Kothagudem: సింగరేణిలో పదోన్నతి: కొత్తగూడెం ఏరియా ఇంజనీర్ సూర్యనారాయణ రాజుకు ఘన సన్మానం!

Kothagudem: కొత్తగూడెం ఏరియా ఇంజినీర్‌గా విధులు నిర్వహించి జీఎంగా పదోన్నతి పొందిన సూర్యనారాయణ రాజును సింగరేణి అధికారులు, కార్మిక సంఘాల నేతలు ఘనంగా సన్మానించారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 9 May 2026 6:45 PM IST
Kothagudem
X

Kothagudem: సింగరేణిలో పదోన్నతి: కొత్తగూడెం ఏరియా ఇంజనీర్ సూర్యనారాయణ రాజుకు ఘన సన్మానం!

Kothagudem: సింగరేణి సంస్థ కొత్తగూడెం ఏరియా జిఎం ఆఫీస్ నందు ఏరియా ఇంజినీర్ (E&M)గా విధులు నిర్వహిస్తూ జి.ఎం ప్రమోషన్ పై ఎస్టిపిపి కు వెళుతున్న సూర్యనారాయణ రాజు ను ఏరియా వర్క్ షాప్ హెచ్ఓడి జే క్రిస్టఫర్, అధ్యక్షన జరిగిన సన్మాన కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎం.డి.రజాక్, వర్క్ షాప్ ఇంజనీర్స్ బి.శంకర్, టి. అనిల్, ఏ ఉపేందర్ బాబు, ఐఎన్టీయూసీ ఫిట్ కార్యదర్శి ఎం.డి. సత్తార్ పాషా, ఏఐటీయూసీ ఫిట్ కార్యదర్శి ఎం.మధు కృష్ణ, సూపర్వైజర్లు పాల్గొని సూర్యనారాయణ రాజును ఘనంగా సన్మానించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూర్యనారాయణ రాజు రెండు సంవత్సరాలుగా జీ ఎం ఆఫీస్ నందు ఏజీఎం గా విధులు నిర్వహిస్తూ కొత్తగూడెం ఏరియా నుండి సత్తుపల్లి వరకు ప్రతి పనిలో కిందిస్థాయి నుండి పై స్థాయి వరకు అధికారులతో మరియు ఉద్యోగుల సమన్వయంతో పని చేశారని, ఉత్పత్తి ఉత్పాదకతలో వారు ప్రత్యేక చొరవ తీసుకొని సత్తుపల్లిలోని సిహెచ్పిలో ఎన్నో విజయవంతమైన వర్క్స్ చేయించడంలో విజయవంతమయ్యారని ప్రశంసించారు.

ముఖ్యంగా బంకర్స్ ఏర్పాటు చేయడంలో బ్రేక్ డౌన్ వచ్చినప్పుడు వారు ఎంతో ఓపికగా అందరికీ సహాయ సహకారాలు అందించి పనిని పూర్తి చేసే వరకు అక్కడే ఉండేవారని, రాత్రి పగలు తేడా లేకుండా పనిని పూర్తి చేయించేవారన్నారు.

కొత్తగూడెం ఏరియాలోని త్రీ ఇంక్లైన్ లో సోలార్ ప్లాంట్, ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహించడమే కాకుండా, సోలార్ మోడల్ రూమ్ ఏర్పాటు చేయడంలో ముఖ్యమైన భూమిక వహించినట్లు వివరించారు. ఈ రెండు సంవత్సరాల కాలంలో ఏరియా ఇంజనీర్ గా అధికారుల మరియు ఉద్యోగుల మన్ననలు పొందారని ,జీ.యం ప్రమోషన్ పై ఎస్టిపిపి కి వెళ్తున్న సందర్భంగా కొత్తగూడెం ఏరియాలోని వర్క్ షాప్ లో వారికి శాలువా కప్పి,మెమెంటో ఇచ్చి ఘనంగా సన్మానం చేయడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో సూపర్వైజర్స్ బి. వెంకట్ రామ్,యు.రమేష్ బాబు, డి భానుచందర్, ఎం రోషన్, ఎస్ డి.యాకుబుద్దీన్, కరుణాకర్, ఆఫీస్ స్టాఫ్ సీనియర్ అసిస్టెంట్ జాన్ కెనడి, ప్రసాద్, మేకల గిరిబాబు, ఉద్యోగులు,మిత్రులు శ్రేయోభిలాషులు, తదితరులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story