Bhadradri Kothagudem: కొత్తగూడెం జిల్లాలో నేడు, రేపు పాఠశాలలకు సెలవులు ప్రకటన!
Bhadradri Kothagudem: భారీ వర్షాల నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సెప్టెంబర్ 23, 24 తేదీల్లో అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించిన కలెక్టర్ అంకిత్.
Bhadradri Kothagudem: కొత్తగూడెం జిల్లాలో నేడు, రేపు పాఠశాలలకు సెలవులు ప్రకటన!
Bhadradri Kothagudem: భారీ వర్షాల నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని పాఠశాలలకు సెప్టెంబర్ 23, 24 తేదీల్లో రెండు రోజులపాటు సెలవులు ప్రకటించారు.
జిల్లాలో కొనసాగుతున్న భారీ వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరికలు, ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న జిల్లా కలెక్టర్ అంకిత్, ఐఏఎస్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్, రెసిడెన్షియల్ పాఠశాలలన్నింటికీ ఈ సెలవులు వర్తిస్తాయని అధికారులు తెలిపారు.
వర్షాల కారణంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మండలాల MEOలు, రెసిడెన్షియల్ పాఠశాలల ప్రిన్సిపాళ్లు, RCOలను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో వర్షాల పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.




