Manuguru: మణుగూరు సింగరేణిలో రెండో రోజు కొనసాగిన పదోన్నతి పరీక్షలు!

Manuguru: మణుగూరు సింగరేణి ఏరియా పీకేఓసీ బేస్ వర్క్‌షాప్‌లో బుధవారం ఈపీ ఆపరేటర్, సీనియర్ మెకానిక్ పదోన్నతుల అర్హత పరీక్షలు రెండో రోజు కొనసాగాయి.

A CHANDRA SHEKAR, PINAPAKA
Published on: 25 Nov 2026 10:58 PM IST
Manuguru
X

Manuguru: మణుగూరు సింగరేణిలో రెండో రోజు కొనసాగిన పదోన్నతి పరీక్షలు!

మణుగూరు: మణుగూరు ఏరియాలోని PKOC బేస్ వర్క్‌షాప్‌లో బుధవారం (25.11.2026) నాడు EP ఆపరేటర్ ఎక్స్కవేషన్ కేటగిరీ 'B' నుండి EP ఆపరేటర్ ఎక్స్కవేషన్ కేటగిరీ 'A' పదోన్నతికి సంబంధించిన అర్హత పరీక్షలు రెండవ రోజు కూడా కొనసాగాయి. ఈ పరీక్షలకు మొత్తం 20 మంది ఉద్యోగులు హాజరయ్యారు.

అదేవిధంగా EP సీనియర్ మెకానిక్ ఎక్స్కవేషన్ కేటగిరీ 'B' నుండి EP సీనియర్ మెకానిక్ ఎక్స్కవేషన్ కేటగిరీ 'A' పదోన్నతికి సంబంధించిన అర్హత పరీక్షను కూడా నిర్వహించగా, ఇద్దరు ఉద్యోగులు పరీక్షకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎస్.ఓ. టు జి.ఎం. శ్రీ డి. వెంకట రామారావు గారు మాట్లాడుతూ, పదోన్నతుల అర్హత పరీక్షల్లో ఉద్యోగుల సాంకేతిక పరిజ్ఞానం, వృత్తి నైపుణ్యం, పనిపట్ల అంకితభావం మరియు భద్రతా ప్రమాణాలపై అవగాహనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. భారీ యంత్రాలను నిర్వహించే సమయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ, ఎలాంటి ప్రమాదాలకు తావులేకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు.

భారీ యంత్రాల పని గంటలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ, యంత్రాల సామర్థ్యానికి అనుగుణంగా ఉత్పత్తిని పెంపొందించాలని, అదే సమయంలో అన్ని భద్రతా ప్రమాణాలను పాటిస్తూ రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలని ఆయన సూచించారు.

ఏరియా ఎస్.ఓ. టు జి.ఎం. శ్రీ డి. వెంకట రామారావు గారి పర్యవేక్షణలో కంపెనీ నిబంధనలకు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా ఈ అర్హత పరీక్షలను నిర్వహిస్తున్నారు. మొత్తం మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ పరీక్షల్లో ఇప్పటికే రెండు రోజుల పరీక్షలు పూర్తయ్యాయని, మిగిలిన పరీక్షలు కూడా పూర్తయిన అనంతరం ఆ నోటీసు బోర్డులో పరీక్షలకు హాజరైన అభ్యర్థులందరి వివరాలను పొందుపరచడం జరుగుతుందని అధికార ప్రతినిధి & ఏజీఎం (పర్సనల్) శ్రీ ఎస్. రమేష్ గారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏజీఎం (పర్సనల్) శ్రీ ఎస్. రమేష్ గారు, ఏరియా ఇంజినీర్ శ్రీ వి. మధన్ నాయక్ గారు, డీజీఎం (ఈ&ఎం), కార్పొరేట్ శ్రీ రామకృష్ణ గారు, సీనియర్ పర్సనల్ ఆఫీసర్, కార్పొరేట్ శ్రీ శ్రావణ్ గారు, PKOC ఇంజినీర్లు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

A CHANDRA SHEKAR, PINAPAKA

A CHANDRA SHEKAR, PINAPAKA