Khammam: సీఎంఆర్ఎఫ్ చెక్కుల మంజూరులో తీవ్ర వివక్ష: ఎంపీ వద్దిరాజు రవిచంద్ర!

Khammam: ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కుల మంజూరులో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతోందని బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మండిపడ్డారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 27 Nov 2026 3:03 PM IST
Khammam
X

Khammam: సీఎంఆర్ఎఫ్ చెక్కుల మంజూరులో తీవ్ర వివక్ష: ఎంపీ వద్దిరాజు రవిచంద్ర!

Khammam: ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఏంఆర్ఏఫ్)చెక్కుల మంజూరులో తీవ్ర వివక్ష కొనసాగుతున్నదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మండిపడ్డారు.అనారోగ్యానికి గురైన పేద వర్గాల వారికి అవసరమైన వైద్య సేవల కోసం సాయమందించడం సీఏంఆర్ఏఫ్ పథకం ఏర్పాటు ముఖ్యోద్దేశమన్నారు.

అయితే,ఈ పథకం కింద నిధులు మంజూరు చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీవ్ర వివక్ష ప్రదర్శిస్తుండడం బాధాకరమన్నారు.ఖమ్మం తెలంగాణ భవన్ లో శుక్రవారం ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ సిఫార్సుతో మంజూరైన 86 చెక్కుల పంపిణీ జరిగింది.ఈ కార్యక్రమంలో మధుతో కలిసి రవిచంద్ర పాల్గొని మాట్లాడుతూ, కాంగ్రెస్ సర్కార్ వైఖరిని దుయ్యబట్టారు.

దరఖాస్తు చేసిన తర్వాత వాటి పరిశీలన,కేటాయింపు, మంజూరు,చెక్కుల ప్రింటింగ్, విడుదలకు ఈ ప్రభుత్వం చాలా సమయం తీసుకుంటున్నదని విమర్శించారు.ప్రధాన ప్రతిపక్షానికి చెందిన ప్రజాప్రతినిధుల సిఫార్సుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారని,వివక్ష కొనసాగుతున్నదని, చాలా తక్కువ శాతం డబ్బులు మంజూరవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పదేళ్ల పాలనలో సీఏంఆర్ఏఫ్ నిధుల మంజూరులో ఎటువంటి వివక్షకు, పక్షవాతానికి తావులేకుండా ప్రజాప్రతినిధులందరి సిఫార్సులను సమ దృష్టితో చూడడం జరిగిందని ఎంపీ రవిచంద్ర చెప్పారు.

ఆ విధంగా సీఏంఆర్ఏఫ్ ద్వారా ఖమ్మం జిల్లా పేదలు,రోగులకు వందల కోట్ల రూపాయల సాయమందిందన్నారు.రాజకీయాలకు అతీతంగా, పక్షపాతానికి తావులేకుండా మానవీయ కోణంలో సీఏంఆర్ఏఫ్ చెక్కులు మంజూరు చేయాల్సిందిగా, దరఖాస్తు చేశాక వీలైనంత తొందరగా పరిష్కరించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఎంపీ వద్దిరాజు కోరారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.