Khammam: జర్నలిస్టులకు శనగపాటి అమ్మా నాన్న ఫౌండేషన్ ప్రతిభా పురస్కారాలు!

Khammam: ఉమ్మడి ఖమ్మం జిల్లా జర్నలిస్టుల కోసం శనగపాటి అమ్మా నాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు ప్రకటించారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 28 Oct 2026 1:23 PM IST
Khammam
X

Khammam: జర్నలిస్టులకు శనగపాటి అమ్మా నాన్న ఫౌండేషన్ ప్రతిభా పురస్కారాలు!

Khammam: శనగపాటి అమ్మా నాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని జర్నలిస్టుల ప్రతిభను పోత్సాహమందించేందుకు ఏటేటా నగదు పురస్కారాలు అందించనున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకులు, సీనియర్ జర్నలిస్టు శనగపాటి మురళీకృష్ణ పేర్కొన్నారు. ఖమ్మం ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఫౌండేషన్ కార్యక్రమాలను వివరించారు.

‘ఎల్‌నినో - పేదల జీవనంపై ప్రభావం’ అనే అంశంపై ఈ ఏడాది అక్టోబర్ 30 నుండి నవంబర్ 30 వరకు రాసిన కథనాలను డిశెంబర్ 10వ తేదీలోగా తమ ఫౌండేషన్ చిరునామాకు పంపించాలని సూచించారు. ప్రింట్ మీడియా జర్నలిస్టులు పేపర్ క్లీప్పింగ్‌తో పాటు ఆ రోజు పత్రికను కథనంతో జత చేసి పంపించాలని సూచించారు. అలాగే డిజిటల్ మీడియా విలేకర్లు కథనంతో పాటు వెబ్ సైట్ లింక్‌ను పంపించాలన్నారు. అవార్డుకు పంపేవారు హామీ పత్రం, పాస్‌పోటో, చిరుమాను జత చేసి పంపించాలన్నారు.

పోటీకి వచ్చిన కథనాలను సీనియర్ జర్నలిస్టులు నామా పురుషోత్తం, కనకం సైదులు ఆధ్వర్యంలో కమిటీ పరిశీలించి ఎంపిక చేస్తుందని తెలిపారు. అవార్డుల ఎంపికలో కమిటీదే తుది నిర్ణయమని, దీనిపై ఎలాంటి ఉత్తర, ప్రత్యుత్తరాలకు తావు లేదని పేర్కొన్నారు. ఎంపిక చేసిన జర్నలిస్టులకు 2028 జనవరిలో అవార్డులను అందచేస్తామన్నారు.

ప్రింట్ మీడియా జర్నలిస్టుకు 5000 నగదు బహుమతి, డిజిటల్ మీడియాకు 3000 నగదు బహుమ తితో పాటు మెమెంటో, ప్రశంసాపత్రం అందచేసి సన్మానించనున్నట్లు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని జర్నలిస్టు మిత్రులు ఈ పురస్కారానికి తమ కథనాలను టి మీడియా కార్యాలయం, ఆర్టీసీ డిపో వెనుక, మామిళ్ళగూడెం అనే చిరునామాకు పంపించాలని కోరారు. పూర్తి వివరాలకు 98666 45218, 8919710365 నెంబర్లలో సంప్రదించాలని కోరారు.

నెలకో కవి సమ్మేళనం నిర్వహణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామాజిక, సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. నెలకో కవి సమ్మేళనం నిర్వహించి వర్ధమాన కవులను ప్రోత్సహిస్తామన్నారు. ప్రతి నెలా ఏదైనా ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్ పోటీలను నిర్వహించి బహుమతులను అందచేస్తామన్నారు.

అలాగే సమకాలీన అంశాలపై చర్చా వేదికలు, సెమినార్లు, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. ఫౌండేషన్ కార్యక్రమాలను అందరూ ప్రోత్సహించి సహకరించాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో జర్నలిస్టుల అవార్డు కమిటీ కన్వీనర్, సీనియర్ జర్నలిస్టు నామా పురుషోత్తం, ఫౌండేషన్ సభ్యులు జి.రామారావు పాల్గొన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.