Sarapaka: దొంగల హల్చల్.. ఒకేసారి నాలుగు వాహనాల బ్యాటరీలు చోరీ!
Sarapaka: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక భాస్కర్నగర్లో ఒకేసారి నాలుగు వాహనాల బ్యాటరీలు చోరీకి గురయ్యాయి. దొంగలను అదుపులోకి తీసుకోవాలని బాధితుల పోలీసు ఫిర్యాదు.
Sarapaka: దొంగల హల్చల్.. ఒకేసారి నాలుగు వాహనాల బ్యాటరీలు చోరీ!
Sarapaka: సారపాక లో వాహనాలు రోడ్డుపై నిలిపి ఉంచాలంటే భయం.. ఇంటి బయట పెట్టాలంటే బెంగ! సారపాకలో చిల్లర దొంగల బెడదతో వాహనాల యజమానులకు భద్రత కరువవుతోంది. భాస్కర్నగర్లోని ముత్యాలమ్మ గుడి సమీపంలో నిలిపి ఉంచిన నాలుగు వాహనాల్లోని బ్యాటరీలను గుర్తుతెలియని దొంగలు అపహరించారు. ఉదయాన్నే వాహనాలను వినియోగించేందుకు వచ్చిన యజమాని బ్యాటరీలు మాయమైనట్లు గుర్తించి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
వాహనాలకు రక్షణ ఏదీ? దొంగలకు అడ్డుకట్ట ఎప్పుడు? అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి దొంగలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేదంటే రేపు బ్యాటరీలే కాదు.. వాహనాలూ మాయమైనా ఆశ్చర్యపోనక్కర్లేదని మండల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.




