Kothagudem:1.23 మెగావాట్ల రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్లను ప్రారంభించిన సీఎండీ

Kothagudem: కొత్తగూడెం సింగరేణి కార్పొరేట్ పరిధిలోని భవనాలపై 1.23 మెగావాట్ల రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్లను సీఎండీ డా. బుద్ధ ప్రకాశ్ జ్యోతి శుక్రవారం ప్రారంభించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 15 Aug 2026 8:04 AM IST
Kothagudem
X

Kothagudem:1.23 మెగావాట్ల రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్లను ప్రారంభించిన సీఎండీ

Kothagudem: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌ కొత్తగూడెం కార్పొరేట్ పరిధిలోని సంస్థ భవనాలపై ఏర్పాటు చేసిన 1.23 మెగావాట్ల రూఫ్‌టాప్ సోలార్ పవర్ ప్లాంట్లను సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డా. బుద్ధ ప్రకాశ్ జ్యోతి శుక్రవారం ప్రారంభించి గ్రిడ్‌కు అనుసంధానం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సింగరేణి అంటే బొగ్గు ఉత్పత్తి సంస్థగా ఉన్న గుర్తింపును దాటి థర్మల్ విద్యుత్‌తో పాటు సోలార్, ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి రంగాల్లోనూ తనదైన ముద్ర వేస్తోందన్నారు. పర్యావరణహిత చర్యల్లో భాగంగా సంస్థ పరిధిలోని ఖాళీ ప్రదేశాల్లో ఇప్పటివరకు 245.5 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

కేంద్ర, తెలంగాణ ప్రభుత్వాల ఆదేశాల మేరకు దేశ, రాష్ట్ర ఇంధన అవసరాలకు అనుగుణంగా భవిష్యత్‌లో మరిన్ని సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. సింగరేణి సంస్థకు చెందిన భవనాలపై రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటును కొనసాగిస్తున్నామని, అందులో భాగంగానే కార్పొరేట్ పరిధిలో 1.23 మెగావాట్ల రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్లను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.

కార్యక్రమంలో డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎల్.వి. సూర్యనారాయణ, డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్) కె. వెంకటేశ్వర్లు, డైరెక్టర్ (ఈ&ఎం) ఎం. తిరుమలరావు, జీఎం (కోఆర్డినేషన్) తాడబోయిన శ్రీనివాస్, జీఎం (సీపీ&పీ) ఎ. మనోహర్, జీఎం (ఈ&ఎం వర్క్‌షాప్ అండ్ ఎనర్జీ మేనేజ్‌మెంట్) కె. శ్రీనివాసులు, గుర్తింపు సంఘం (ఏఐటీయూసీ) బ్రాంచ్ సెక్రటరీ ఎస్.వి. రమణమూర్తి, ప్రాతినిధ్య సంఘం (ఐఎన్‌టీయూసీ) సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సి. త్యాగరాజన్, కార్పొరేట్ సీఏంఓఏఐ ఉపాధ్యక్షుడు కేశవరావు, ఇతర అధికారులు, ఉద్యోగులు, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story