Singareni: చరిత్రలో కొత్త ఘట్టం: నైనీ నుండి జైపూర్‌కు తొలి బొగ్గు రైలు
Singareni: ఒడిశాలోని నైనీ గని నుంచి తొలిసారిగా బొగ్గుతో బయలుదేరిన రైల్వే రేక్ మంచిర్యాల జిల్లా జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్‌కు చేరుకుంది.
Singareni: చరిత్రలో కొత్త ఘట్టం: నైనీ నుండి జైపూర్‌కు తొలి బొగ్గు రైలు
పెద్దపల్లి జిల్లా రామగుండం
తెలంగాణ లో బొగ్గు గనుల సంస్థ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) .
కేంద్ర ప్రభుత్వం మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త భాగస్వామ్యంతో నడుస్తోంది.
ప్రధాన కేంద్రంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం ఉంది. తెలంగాణలోని గోదావరి లోయ ప్రాంతాల్లో దాదాపు 350 కిలోమీటర్ల మేరకు ఈ బొగ్గు నిలువలు విస్తరించి ఉన్నాయి.సంస్థ ప్రస్తుతం అనేక ఓపెన్‌కాస్ట్ మరియు భూగర్భ (అండర్‌గ్రౌండ్) గనులను నిర్వహిస్తోంది.
సింగరేణి సంస్థ తెలంగాణ సరిహద్దులు దాటి ఒడిశాలోని 'నైనీ' బొగ్గు గని నుండి తొలి బొగ్గు రవాణాను విజయవంతంగా ప్రారంభించి చరిత్ర సృష్టించింది.
సింగరేణి చరిత్రలో ఇది ఒక చారిత్రాత్మక మైలురాయి..
ఒడిశాలోని సింగరేణి నైనీ గని నుంచి తొలి బొగ్గు రైల్వే రేకు మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ (STPP)కు విజయవంతంగా చేరుకుంది.
ఈ చారిత్రాత్మక సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో INTUC సెక్రటరీ జనరల్ డా. శ్రీ జనక్ ప్రసాద్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన సింగరేణి యాజమాన్యానికి, అధికారులు, ఉద్యోగులు, కార్మికులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఒడిశా నుంచి చేరుకున్న తొలి బొగ్గు రైల్వే రేకుకు ఎస్టీపీపీ ప్రాంగణంలో డా. జనక్ ప్రసాద్,
సింగరేణి డైరెక్టర్లు ఎల్.వి. సూర్యనారాయణ , ఎం. తిరుమల రావు తో కలిసి ఘన స్వాగతం పలికారు




