Kothagudem: కొత్తగూడెంలో సింగరేణి కార్మిక సంఘాల భారీ మహా ధర్నా

Kothagudem: నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, జేబీసీసీఐ-12వ వేతన చర్చలు ప్రారంభించాలని కొత్తగూడెం సింగరేణి ఆఫీస్ ఎదుట జాతీయ కార్మిక సంఘాల మహా ధర్నా.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 1 July 2026 2:53 PM IST
Kothagudem
X

Kothagudem: కొత్తగూడెంలో సింగరేణి కార్మిక సంఘాల భారీ మహా ధర్నా

కొత్తగూడెం జిల్లా: కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని, అలాగే JBCCI–12వ వేతన ఒప్పంద చర్చలను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు కొత్తగూడెం కార్పొరేట్ కార్యాలయం ఎదుట జాతీయ కార్మిక సంఘాల సంయుక్త వేదిక ఆధ్వర్యంలో INTUC, AITUC, CITU, HMS సంఘాలు భారీ మహా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాయి.

ఈ కార్యక్రమంలో నాలుగు కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని మహా ధర్నాను విజయవంతం చేశారు. అనంతరం సంఘాల ప్రతినిధులు సింగరేణి జీఎం (వెల్ఫేర్) కిరణ్ కుమార్ కి తమ ప్రధాన డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో INTUC సెక్రటరీ జనరల్ డా. శ్రీ బి. జనక్ ప్రసాద్ , మాట్లాడుతూ

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లు కార్మికుల హక్కులను హరించే విధంగా ఉన్నాయని, వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే సింగరేణి కార్మికుల ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న JBCCI–12వ వేతన ఒప్పంద చర్చలను ఆలస్యం చేయకుండా వెంటనే ప్రారంభించి, న్యాయమైన వేతన సవరణను అమలు చేయాలని యాజమాన్యాన్ని కోరారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో INTUC సెక్రటరీ జనరల్ బి. జనక్ ప్రసాద్ నాయకత్వంలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు, 12 ఏరియాల వైస్ ప్రెసిడెంట్లు, సెంట్రల్ నాయకులు, ఏరియా నాయకులు, మహిళా నాయకులు, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story