Mamillagudem: ఖమ్మం మామిళ్లగూడెం 45వ డివిజన్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ!

Mamillagudem: ఖమ్మం నగరంలోని మామిళ్లగూడెం 45వ డివిజన్ 36వ రేషన్ షాప్ వద్ద స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని అర్బన్ కాంగ్రెస్ అధ్యక్షుడు దీపక్ చౌదరి ప్రారంభించారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 26 Nov 2026 7:57 PM IST
Mamillagudem
X

Mamillagudem: ఖమ్మం మామిళ్లగూడెం 45వ డివిజన్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ!

ఖమ్మం: ఈరోజు ఖమ్మం నగరంలోని మామిళ్లగూడెం 45వ డివిజన్ పరిధిలోని 36వ రేషన్ షాప్ నందు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఖమ్మం అర్బన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి గారు లబ్ధిదారులకు స్వయంగా స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.

ఈ కార్యక్రమంలో అర్బన్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి షేక్ ముజీబ్ గారు, ఓబీసీ సెల్ నగర అధ్యక్షుడు బాణాల లక్ష్మణ్ గారు, ఐఎన్‌టీయూసీ నగర అధ్యక్షుడు నరాల నరేష్ నాయుడు గారు, కట్టా నాగేశ్వరరావు గారు, అర్బన్ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి కోనేటి నారాయణ గారు, నగర కాంగ్రెస్ నాయకులు జాకీర్ హుస్సేన్ గారు, 48వ డివిజన్ అధ్యక్షుడు అల్లే సాయికిరణ్ గారు, 46వ డివిజన్ అధ్యక్షుడు తుపాకుల మధు గారు తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

ప్రజలకు మెరుగైన పౌర సేవలు, సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.