Sujathanagar: సుజాతనగర్‌లో రైతులకు భూసార పరీక్షలపై అవగాహన సదస్సు!

Sujathanagar: సుజాతనగర్‌లో ఎస్‌బీఐ, కొత్తగూడెం PACS ఆధ్వర్యంలో రైతులకు భూసార పరీక్షలు, వరి నాటు పద్ధతులపై అవగాహన సదస్సు నిర్వహించారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 24 July 2026 11:27 PM IST
Sujathanagar
X

Sujathanagar: సుజాతనగర్‌లో రైతులకు భూసార పరీక్షలపై అవగాహన సదస్సు!

Sujathanagar: కొత్తగూడెం సహకార సంఘం పరిధిలోని సుజాతనగర్ ఎరువుల గోదాంలో ఎఫ్ పి ఓ లో భాగంగా SBI వారి సహకారంతో..సైంటిస్టు కవిరాజు సుజాతనగర్ మండల రైతులకు భూసార పరీక్షలపై అవగాహన సదస్సు మరియు వరి నాటు పద్ధతి పై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా PACS కొత్తగూడెం అధ్యక్షులు మండె‌వీర హనుమంతరావు మాట్లాడుతూ.. ఇట్టి అవకాశాన్ని సొసైటీ రైతులందరూ ఉపయోగించుకోవాలని, తద్వారా రైతులు భూమిలో ఎలాంటి ఎరువులు, ఎంత మోతాదులో వాడాలో తెలుసుకోవాలన్నారు.

అధిక దిగుబడులు పొందాలని మరియు వరి నాటు పద్ధతిని. మెట్టచేలో నాటే పద్ధతి మరియు దమ్ము చేసి నాటే పద్ధతిపై మెళుకువలు తెలుసుకోవాలని సూచించారు. రైతులు సైంటిస్టులు, వ్యవసాయ నిపుణులు , వ్యవసాయ అధికారుల సలహాలను పాటించాలన్నారు.

అవగాహనతో కూడిన సాగు పద్ధతులను పాటిస్తూ, ఖర్చు తగ్గించుకొని అధిక దిగుబడులు సాధించి మంచి ఆదాయం పొందాలని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం వారి సహకారంతో ఎస్బిఐ వారి ఆధ్వర్యంలో కొత్తగూడెం సంఘమునకు భూసార పరీక్ష కిట్లను అందజేశారని, ఇట్టి పరికరాలను ఉపయోగించుకొని రైతులు తమ పంట పొలాల్లో భూసార పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సంఘంలో రైతులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలని, వాయిదా మీరీన బాకీలపై వడ్డీని వెంటనే చెల్లించి అపరాధపవడ్డీ పడకుండా చూసుకోవాలని రైతులను కోరారు.

ఈ కార్యక్రమంలో డొమైన్ ఎక్స్పర్ట్ అరుంధతి, సంఘ డైరెక్టర్లు.. రామచంద్రరావు,పోటు వెంకటేశ్వరరావు, బండి అమృత రావు , రైతులు షేక్ మౌలానా, నల్లగోపు పుల్లయ్య రైతు సంఘం నాయకులు, వెంకటేశ్వర్లు మల్లెల రవి ,మల్లెల బాల రెడ్డి, కత్తి నరసింహారావు, సొసైటీ కార్యదర్శి N.V. రమణారెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story