Sathupalli: అక్రమ సంబంధానికి అడ్డు వస్తోందని అత్త దారుణ హత్య!

Sathupalli: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో వివాహేతర సంబంధానికి అడ్డు వస్తోందని ప్రియురాలితో కలసి అత్తను హతమార్చాడు అల్లుడు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 9 Aug 2026 8:20 PM IST
Sathupalli
X

Sathupalli: అక్రమ సంబంధానికి అడ్డు వస్తోందని అత్త దారుణ హత్య!

సత్తుపల్లి: ఖమ్మం జిల్లా సత్తుపల్లి లో అక్రమ సంబంధానికి అడ్డు వస్తుందని అల్లుడు తన ప్రియురాలితో కలిసి అత్తను హతమార్చిన ఘటన సత్తుపల్లి మండలంలో చోటుచేసుకుంది. కల్లూరు ఇంచార్జి ఏసిపి సాధుల సారంగ పాణి సత్తుపల్లి పియస్ లో ఆదివారం జరిగిన ప్రెస్ మీట్ లో వివరాలు తెలిపారు.

సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామానికి గుండాల వెంకట నరసమ్మ (65) తన కూతురు మంగమ్మ ను సత్తుపల్లి మండలం తాళ్లమడ గ్రామానికి చెందిన వెదుళ్ల తిరుపతి రావు కి ఇచ్చి రెండవ వివాహం చేసింది. అతడు ఎలక్ట్రీషియన్ గా పని చేస్తూ తుంబూరు లోనే అత్త ఇంటి వద్ద ఉంటున్నాడు. అదే గ్రామంలో భర్త చనిపోయి కూలీ పనులు చేసుకుంటున్న పగుట్ల సునీత అనే మహిళతో పరిచయం ఏర్పడి వివహేతార సంబంధంగా మారింది.

ఈ విషయంలో తిరుపతిరావు భార్య మంగమ్మ, అత్త వెంకటనరసమ్మ లు పలు మార్లు గొడవ పడ్డారు. గత నెల 30 న మంగమ్మ, వెంకట నరసమ్మ లు కలిసి దుద్దే పూడి గ్రామం లో పని చేస్తున్న సునీత దగ్గర కి వెళ్లి తిరుపతిరావు ను వదిలి పెట్టాలని తిట్టి కొట్టారు. దానితో తనకు అవమానం జరిగిందని తమకు అడ్డుగా ఉన్న అత్త వెంకట నరసమ్మ ను అంతం చేయాలనీ ప్రియుడు తిరుపతి రావు తో కలిసి ప్లాన్ చేశారు. ఈ నెల 2 న తిరుపతిరావు, సునీత లు అర్ధరాత్రి 12 గంటల సమయంలో వెంకటనరసమ్మ ఇంటికి వెళ్లారు. టీవీ చూస్తున్న ఆమెను చీరతో గొంతు నులిమి హత్య చేశారు.

శవాన్ని బైక్ పై ఇద్దరి మధ్య కూర్చో పెట్టుకుని నారాయణపురం గ్రామ శివారుకు తీసుకెళ్లి కట్టెలు కొబ్బరి మట్టలు చెత్త వేసి కాల్చి వెళ్లారు. శవం పూర్తి గా కాలలేదని అనుమానంతో పెట్రోల్ తీసుకుని మళ్ళీ వచ్చి తగలుబెట్టి వెళ్లారు. తుంబూరు గ్రామ సర్పంచ్ వీరబాబు, జిపిఓ లక్ష్మణ్ లకు తాము చేసిన హత్య విషయం తెలిపారు. పోలీస్ స్టేషన్ లో లొంగిపోవాలని వారు చెప్పడంతో అక్కడ నుండి పరారు అవ్వగా పోలీసులు నిందితులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి బైక్ రెండు సెల్ ఫోన్ లు స్వాదినం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ప్రెస్ మీట్ లో సత్తుపల్లి సిఐ శ్రీహరి సిబ్బంది పాల్గొన్నారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI

Next Story