Kothagudem: కొత్తగూడెం పోలీసుల సామూహిక యోగాసనాలు.. పాల్గొన్న ఎస్పీ
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ పరేడ్ మైదానంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
Kothagudem: కొత్తగూడెం పోలీసుల సామూహిక యోగాసనాలు.. పాల్గొన్న ఎస్పీ
కొత్తగూడెం: యోగా ద్వారా పని ఒత్తిడి నుండి ఉపశమనం కలగడంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని,ఆనందమయమైన జీవితానికి ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో అలవాటుగా చేసుకోవాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ అన్నారు.12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పోలీస్ శాఖ ఆద్వర్యంలో జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ పరేడ్ గ్రౌండ్ నందు యోగా తరగతులు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉంటూ ఆనందమైన జీవితానికి యోగా ఉపయోగపడుతుందని,వేల సంవత్సరాల నుండి యోగా భారత దేశ సంస్కృతిలో బాగంగా ఉండడం మనకు దక్కిన గొప్ప గౌరవం అని,ప్రపంచ దేశాలు యోగా ప్రాముఖ్యతను తెలుసుకొని ప్రత్యేక గుర్తింపును ఇచ్చాయని అన్నారు. పోలీస్ అధికారులకు, సిబ్బందికి విధి నిర్వహణలో ఒత్తిడి అనేది సర్వసాధారణం.
శారీరక, మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని, యోగ కేవలం వ్యాయామం మాత్రమే కాదు, ఒక జీవన విధానం ప్రతి ఒక్కరూ యోగాను నిజ జీవితంలో ఒక అలవాటుగా మార్చుకోవాలని అన్నారు.ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పోలీసు అధికారులు,సిబ్బందితో యోగాసనాలు,ధ్యానం,శ్వాస పైన ధ్యాస,సూర్య నమస్కారాలు, ప్రాణాయామము తదితర ఆసనాలను వేసి వాటి వలన కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్బంగా జిల్లా ప్రజలకు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలోకొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ,ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ మరియు కొత్తగూడెం సబ్ డివిజన్ లోని పోలీస్ అధికారులు,ఆర్ఐలు, సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.




