Julurupadu: జూలూరుపాడు ఆలయాల్లో కార్తీక సోమవారం ప్రత్యేక పూజలు!

Julurupadu: కార్తీక రెండవ సోమవారం సందర్భంగా జూలూరుపాడు మండలంలోని పాపకొల్లు ఉమా సోమలింగేశ్వర స్వామి సహా పలు ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు.

SK MAHABOOB JANI, JULURPADU
Published on: 23 Nov 2026 3:10 PM IST
Julurupadu
X

Julurupadu: జూలూరుపాడు ఆలయాల్లో కార్తీక సోమవారం ప్రత్యేక పూజలు!

Julurupadu: కార్తీకమాసం రెండవ సోమవారాన్ని పురస్కరించుకుని జూలూరుపాడు మండలంలోని పలు ఆలయాలు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. పాపకొల్లులోని శ్రీ ఉమా సోమలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు తెల్లవారుజామున చేరుకుని దీపాలు వెలిగించి,అభిషేకాలు చేశారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి తమ భక్తి పార్వస్యాన్ని చాటుకున్నారు.

జూలూరుపాడులోని రామాలయం, వెంకన్నపాలెంలోని ఆంజనేయస్వామి ఆలయం, గుండెపుడి అనంతరం గ్రామాల్లోని ఆలయాలతో పాటు, కాకర్లలోని పాలగుట్టపై వేంచేసి ఉన్న శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. శివనామ స్మరణలతో ఆలయ ప్రాంగణాలు మారుమోగాయి.

మంగళవారం కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని పాపకొల్లులోని ఉమా సోమలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పౌర్ణమి సందర్భంగా ఈ ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి రానుండడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.

SK MAHABOOB JANI, JULURPADU

SK MAHABOOB JANI, JULURPADU