Sathupalli: సత్తుపల్లిలో పనికి ఆహార పథకం మేట్లకు శిక్షణ

Sathupalli: సత్తుపల్లి మండలంలో పనికి ఆహార పథకం మేట్లకు ఒకరోజు శిక్షణ జరిగింది. కూలీలకు ₹308 వేతనం వచ్చేలా, ఎన్‌ఎంఎంఎస్ హాజరు సరిగ్గా నమోదు చేయాలని ఏపీడీ సూచించారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 7 Nov 2026 8:16 PM IST
Sathupalli
X

Sathupalli: సత్తుపల్లిలో పనికి ఆహార పథకం మేట్లకు శిక్షణ

సత్తుపల్లి: సత్తుపల్లి మండలంలో పనికి ఆహార పథకం (VB-G RAM G) అమలులో భాగంగా మేట్లకు నిర్వహించిన ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని సత్తుపల్లి ఎంపీడీవో ప్రారంభించారు. కల్లూరు క్లస్టర్ ఏపిడి చలపతి ఆధ్వర్యంలో మండలంలోని మేట్లకు పథకం నిర్వహణ, విధి విధానాలపై శిక్షణ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఏపిడి చలపతి మాట్లాడుతూ మేట్లకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా, బాధ్యతాయుతంగా నిర్వహించాలని సూచించారు. ఉపాధి కూలీలకు, అధికారులకు మధ్య సమన్వయంతో పనిచేస్తూ పథకం లక్ష్యాలను విజయవంతంగా అమలు చేయడంలో కీలక పాత్ర పోషించాలని అన్నారు.

కూలీల హాజరును ఎన్‌ఎంఎంఎస్ విధానంలో నమోదు చేసి అప్‌లోడ్ చేయడం, మస్టర్ల నిర్వహణ, రోజువారీ కూలి రూ.308 వచ్చేలా పనులకు తగిన మార్కింగ్ ఇవ్వడం, కొలతల ప్రకారం పనులు చేయించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా పని ప్రదేశాల్లో కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించాలని, జాబ్ కార్డులు లేని వారికి కొత్త కార్డులు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని, పాత జాబ్ కార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని సూచించారు.

ప్రతి పనిప్రదేశంలో మేట్లు కూలీలకు అందుబాటులో ఉంటూ పనుల కొలతలు, నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు. గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్లకు సహాయకారిగా ఉంటూ గ్రామాల్లో ఉపాధి పనులను గుర్తించడంలో సహకరించాలని సూచించారు. పథకం అమలులో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా అన్ని అంశాల్లో అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

ఈ శిక్షణ కార్యక్రమంలో ఏపీఓ నరసింహారావు, ఈసీ శ్రీను, సాంకేతిక సహాయకులు (టీఏలు), కంప్యూటర్ ఆపరేటర్లు (సీఓలు), మండలంలోని మేట్లు పాల్గొన్నారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI