Khammam: లిటిల్ స్టార్స్ ఆటిజం సెంటర్‌ను ప్రారంభించిన సుడా చైర్మన్!
Khammam: ఖమ్మం నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన లిటిల్ స్టార్స్ ఆటిజం అండ్ రిహాబిలిటేషన్ సెంటర్‌ను శుక్రవారం సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గ ప్రసాద్ ప్రారంభించారు.
Khammam: లిటిల్ స్టార్స్ ఆటిజం సెంటర్‌ను ప్రారంభించిన సుడా చైర్మన్!
ఖమ్మం: ఖమ్మం నగరంలో ఏర్పాటు చేసిన లిటిల్ స్టార్స్ ఆటిజం అండ్ రిహాబిలిటేషన్ సెంటర్‌ను ఖమ్మం సుడా చైర్మన్ శ్రీ పువ్వాళ్ళ దుర్గ ప్రసాద్ గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆటిజంతో పాటు వివిధ అభివృద్ధి సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్న చిన్నారులకు సరైన వైద్యం, ప్రత్యేక శిక్షణ, పునరావాస సేవలు అందించడం ఎంతో అభినందనీయమని అన్నారు. చిన్నారుల ఎదుగుదలకు తల్లిదండ్రుల ప్రేమ, సహనం, ప్రోత్సాహంతో పాటు సమాజ సహకారం కూడా ఎంతో అవసరమని పేర్కొన్నారు.
ప్రతి చిన్నారిలోనూ ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుందని, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, స్వతంత్రంగా జీవించేలా తీర్చిదిద్దేందుకు ఇలాంటి కేంద్రాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు.
లిటిల్ స్టార్స్ ఆటిజం అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ యాజమాన్యం చేపట్టిన ఈ సేవా కార్యక్రమాన్ని ఆయన అభినందిస్తూ, భవిష్యత్తులో మరింత మంది చిన్నారులకు సేవలందించాలని ఆకాంక్షించారు.




