Sujatanagar: సుజాతనగర్‌లో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో

Sujatanagar: కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సుజాతనగర్‌లో బీఆర్‌ఎస్ శ్రేణుల భారీ రాస్తారోకో, నిరసన ప్రదర్శనలు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 17 Aug 2026 4:16 PM IST
Sujatanagar
X

Sujatanagar: సుజాతనగర్‌లో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో

సుజాతనగర్: బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సుజాతనగర్ మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో నిర్వహించారు. పార్టీ శ్రేణులు నల్లజెండాలు, నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ సుజాతనగర్ మండల అధ్యక్షుడు లావుడియా సత్యనారాయణ నాయక్, నాయకులు చింతలపూడి జగన్, పెద్దమల్ల నరేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం అప్పటి ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు పేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ పథకాల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు రూ.1,00,116 ఆర్థిక సహాయం అందించారని పేర్కొన్నారు.

పేద, నిరుపేద కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న ఈ పథకాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని వారు అన్నారు. ప్రభుత్వం పథకాలను నీరుగార్చే విధంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ, వెంటనే కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచులు బూరుగు ఇస్తారయ్య, బానోత్ లక్ష్మణ్, మాజీ శివాలయం కమిటీ చైర్మన్ అన్నపురెడ్డి శ్యాంసుందర్ రెడ్డి, ఆంగోత్ గంగా, చల్ది రవి, మాలోత్ ప్రసాద్, ఆంగోత్ లక్ష్మణ్, మాలోత్ రాందాస్, మాలోత్ కుమార్, జె. కుమార్, ఎస్‌కే బనగీ సాహెబ్, మాచిన శ్రీకాంత్, రహీం, మండే చిన్నచంటి, ప్రదీప్, సంగు రాజేష్, కిషోర్, పులి వెంకటేష్, గడ్డం శ్రీను, కదిరి బాబు, ఆంగోత్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story