Sujathanagar: వర్షాల కోసం వింత ఆచారం: నాయకులగూడెంలో కప్పల పెళ్లి!
Sujathanagar: ఎల్నినో ప్రభావంతో కరువైన వర్షాలు. వరుణ దేవుని కటాక్షం కోసం సుజాతనగర్ మండలం నాయకులగూడెంలో భక్తిశ్రద్ధలతో కప్పల పెళ్లి నిర్వహించిన గ్రామస్తులు.
Sujathanagar: వర్షాల కోసం వింత ఆచారం: నాయకులగూడెంలో కప్పల పెళ్లి!
Sujathanagar: ఎల్నినో ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో,
మృగశిర కార్తె , ఆరుద్ర కార్తెలు వచ్చి పోయి అడపాదడపా వానలు కురసి మొఖం చాటేయడంతో అన్నదాతలు అల్లాడి పోతున్నారు.
ఈ నేపథ్యంలో వరుణుడి కటాక్షం కోసం సుజాతనగర్ మండలం..నాయకుల గూడెం రైతు గ్రామంలో గ్రామ ప్రజలు కప్పల పెళ్లి నిర్వహించారు.
వర్షాలు సకాలంలో పడనప్పుడు వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి కప్పల పెళ్లి చేయడం గ్రామ ఆనవాయితిగా వస్తున్నది..
ఈ నేపథ్యంలో ఆదివారం నాడు వర్షాలు సమృద్ధిగా కురవాలని రెండు కప్పలను
పట్టుకుని వాటికి పెళ్లి చేసారు. ఇలా చేయడం వల్ల వర్షాలు కురుస్తాయని పూర్వీకుల నుండి గ్రామస్తులు నమ్మకం.
ఈ ఆచారంలో భాగంగా చిన్నారులు కప్పలను గ్రామంలో ఊరేగింపుగా.. ఇంటింటికి తిరిగుతూ వేడుక నిర్వహించారు.




