Sathupally: భీమవరం బడిలో పలకల పంపిణీ దాతలకు వలపర్ల రవికుమార్ పిలుపు!

Sathupally: ఖమ్మం జిల్లా సత్తుపల్లి స్వర్ణిక దివ్యాంగుల సేవా ఆశ్రమం ఆధ్వర్యంలో భీమవరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పేద పిల్లలకు పలకలు, స్నాక్స్ ఉచితంగా పంపిణీ చేశారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 11 Aug 2026 5:01 PM IST
Sathupally
X

Sathupally: భీమవరం బడిలో పలకల పంపిణీ దాతలకు వలపర్ల రవికుమార్ పిలుపు!

Sathupally: ఖమ్మం జిల్లా సత్తుపల్లి సిద్దారాం రోడ్ నందు గల స్వర్ణిక దివ్యాంగుల సేవా ఆశ్రమం దివ్యాంగుల ఆధ్వర్యంలో పట్వారీ గూడెం గ్రామ నివాసి శ్రీ రాముల జనార్ధన్ (IKP -DRDA) DMG గారు వారి పిల్లల పేరు మీద భీమవరం గ్రామంలో ప్రైమరీ ప్రభుత్వ స్కూల్ లో చదివే పిల్లలకు పలకలు, స్నాక్స్ పంపిణీ చేయుటకు ఆర్ధిక సాయం చెయ్యడం జరిగినది.

ఈ కార్యక్రమంలో భాగంగా ఆశ్రమ నిర్వహకులు వలపర్ల రవికుమార్ మాట్లాడుతూ కొన్ని ప్రభుత్వ స్కూల్ చదివే పేద ప్రజలకు నోట్ బుక్స్ అవసరం ఉన్నవి కావున దాతలు ముందుకు వచ్చి తమ వంతు సాయం చేసి కొంత మందిని అయిన మన వంతు సాయం చేసి వారి చదువుకు కృషి చేయాలని కోరుతున్నాము అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉద్యోగులు పాల్గొన్నారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI

Next Story