Bhadradri: తాలిపేరు ప్రాజెక్టుకు జలకళ.. 10 గేట్లు ఎత్తివేత!
Bhadradri: కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీ వరద నీరు చేరడంతో, 30 వేల క్యూసెక్కుల ప్రవాహంతో 10 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు.
Bhadradri: తాలిపేరు ప్రాజెక్టుకు జలకళ.. 10 గేట్లు ఎత్తివేత!
తాళి పేరు ప్రాజెక్టుకు జలకల
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టు కు జల కల.. ఛత్తిస్ గడ్ రాష్టంలో కురిసిన భారీ వర్షాలకు పలు వాగులు వంకలు పొంగి తాలిపేరు ప్రాజెక్టుకు చేరుకున్నాయి. తాళి పేరు ప్రాజెక్టుకు ఎగువున గుట్టల్లో రో్టేంత వాగు, చింత వాగుల మీదగా ఈ వరద ప్రవాహం ఉంటుంది, ప్రస్తుతం తాళి పేరు ప్రాజెక్టుకు భారీగా 30వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరడంతో 10 గేట్లు ఎత్తి దిగువన గోదావరిలోకి ప్రాజెక్ట్ అధికారులు 25వేల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేశారు.. ఎప్పటికప్పుడు ఎడమ కుడి కాల్వల ద్వారా పంట పొలాలకు నీరు అందే విధంగాఇరిగేషన్ అధికారులు పర్యవేక్షిస్తూ మరోపక్క ప్రాజెక్టుకు వరద ఉదృతి 74 మీటర్ల పై రావడంతో ఈ యొక్క గేట్లను ఎత్తుతున్నట్లు ఇరిగేషన్ సిబ్బంది తెలిపారు. గేట్లను ఎత్తిన సమయంలో వరద వరదృతి జలకళ. ఈ యొక్క జలకాల దృశ్యాలను వీక్షించేందుకు పర్యటికలు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు.




