Burgampahad: సారపాకలో డ్రైన్ పనులు నాణ్యతగా లేవు..టీడీపీ నేత ఆరోపణ!

Burgampahad: బూర్గంపాడు మండలం సారపాకలో ఐటీసీ సీఎస్ఆర్ నిధులతో జరుగుతున్న డ్రైనేజీ పనుల్లో నాణ్యత లేదని, వ్యయం పెరగడంపై టీడీపీ నేత కాకర్ల సత్యనారాయణ మండిపడ్డారు.

RAVI, BURGAMPAD AREA
Published on: 27 Oct 2026 11:48 AM IST
Burgampahad
X

Burgampahad: సారపాకలో డ్రైన్ పనులు నాణ్యతగా లేవు..టీడీపీ నేత ఆరోపణ!

Burgampahad: బూర్గంపాడు మండలం సారపాక లో ఐటిసి సిఎస్ఆర్ నిధులతో నిర్మాణం జరుగుతున్న డ్రైనేజీ పనులు నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని, పాత డ్రైన్లకు మరమ్మతులు కొన్ని చోట్ల చేస్తున్నారని క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని డిమాండ్ చేస్తున్న టిడిపి నేత కాకర్ల సత్యనారాయణ.

1.05... కోట్లతో మొదలుపెట్టి.... ప్రస్తుతం...1.15.. కోట్లు..అని చెబుతున్నారు. ఎందుకు పెరిగింది.

పనులు చేసేటప్పుడు వైబ్రేటర్ పెట్టడం లేదని, క్యూరింగ్ చేయడం లేదని, క్షేత్రస్థాయిలో పనులు పర్యవేక్షణ జరగడంలేదని ప్రజల సొమ్మును ఇలా చేయటం సరికాదని వెంటనే కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన స్థానిక నేతలు.

ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసిన డ్రైనేజీ ఇష్టానుసారంగా కాంట్రాక్టు నిర్మాణం చేస్తున్నాడని తగిన చర్యలు తీసుకోవాలని ఐటీసీ నిధులు వృధా చేయరాదని కోరారు.

కాంట్రాక్టర్ ఇస్తానుసరం గా పనులు చేస్తున్నాడని వారికి పలువురు మద్దతు తెలియజేస్తూ ఉండటం సరికాదని దీనిపైరాబోయే రోజుల్లో గ్రామపంచాయతీలో నిలదీయడం జరుగుతుందని పలువురు పాలక వర్గ సభ్యులకు కూడా దీనిపై వ్యతిరేకిస్తున్నారని అన్నారు.

RAVI, BURGAMPAD AREA

RAVI, BURGAMPAD AREA